//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం... వారిద్దరిపైనా లైఫ్ బ్యాన్!

Category : sports

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆసిస్ ఓపెనర్ కామెరాన్ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డాడు. ఇది మైదానంలో ఉన్న కెమెరాల్లో స్పష్టంగా కనపడింది. అలాగే కావాలనే బాల్ ట్యాంపరింగ్ చేశామని బహిరంగంగా చెప్పి ఆస్ట్రేలియా పరువు అడ్డంగా తీసేశారు క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లు అయితే ఇప్పుడు వై మీద జీవితకాల నిషేధం విధించనున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. క్రికెట్ లో బాల్ ను ట్యాంపరింగ్ చేయడం అతిపెద్ద నేరాల్లో ఒకటి, ఒకవేళ ఈ పని చేసిన వాళ్లను ఆసీస్ జట్టులో కొనసాగనిస్తే, అది దేశ పరువు, ప్రతిష్ఠలపై విమర్శలు తెస్తుందని అందుకే వారిద్దరినీ జట్టు నుంచి, క్రికెట్ నుంచి పూర్తిగా నిషేధించాలని అధికారులు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. వారు చేసిన నేరానికి కేవలం ఒక్క మ్యాచ్ నిషేధం విధించి వదిలేస్తే సరిపోదని, ఇది ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్తును నాశనం చేయకుండా చూడాలని వారు కోరినట్టు సమాచారం.

అయితే ఇలా చేసి దొరికింది మన క్రికెటర్లేనా? అని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్నబుల్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికన్నా అడుక్కోవడం నయమని, రోల్ మోడల్స్ గా ఉండాల్సిన ఆటగాళ్లు ఇలా మారిపోయారంటే నమ్మలేకున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Related News