ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఛాంపియన్ ట్రోపి జూన్ 1 న ప్రారంభంకానుంది. ఈ మినీ ప్రపంచకప్ లో పాల్గొనే జట్లు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఆటగాళ్లు దాదాపు లండన్ కు చేరిపోయారు. ఐపీఎల్ ఆడుతున్న వారు కొంత మంది ఇప్పటికే వెళ్లగా ,మిగిలిన వారు టోర్నీ ముగిచిన వెంటనే నేరుగా లండన్ కి వెళ్లనున్నారు.
ఆసీస్ బృందంలోని నలుగురు క్రీడాకారులతో కలిసి కోచ్ డారెన్ లెహ్మాన్ త్వరలో లండన్ వెళ్లనున్నాడు. ఆల్‌రౌండర్ స్టయినీస్, పేసర్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ తదితరులు బ్రిస్బేన్‌లోని బుపా నేషనల్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆటగాళ్లు ముందుగానే చేరుకున్నట్లు సిబ్బంది తెలిపారు. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా జూన్ 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.