అండర్-19 ప్రపంచకప్‌లో భారత బౌలర్లు మరోసారి సత్తాచాటారు. నాలుగో సారి విశ్వవిజేతగా భారత్ నిలిచేందుకు ద్వారాలు తెరిచారు.
న్యూజిలాండ్ వేదికగా శనివారం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో మన బౌలర్లు ఇషాన్ పోరెల్ (2/30), శివ సింగ్ (2/36), కమలేశ్ (2/41), అనుకుల్ రాయ్ (2/7) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 216 పరుగులకే కుప్పకూలిపోయింది.
రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్ కెప్టెన్ పృథ్వీ షా 29 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. సదర్లాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. షా స్థానంలో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. మన్జోత్ కైరా హాఫ్ సెంచరీ తో భారత్ ను ముందుకు నడిపిస్తున్నాడు.మ్యాచ్ 18 ఓవర్లు ముగిసేసరికి 118 /1 స్క్రోర్ తో పటిష్ట స్థితి లో వుంది.