//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కన్న తల్లిని చంపబోయిన కసాయి..!

Category : national

పిల్లలంటే ఎవరికి ఇష్టముండదు, ముద్దులొలికే చిన్నారులు కనిపిస్తే చాలు ముద్దు చేయాలనిపిస్తుంది.మన పిల్లలు కాకపోయినా వాళ్లకేదైనా ఇబ్బంది కలిగినట్లు తెలిస్తే మన మనసు చివుక్కుమంటుంది.అలాంటి తలిదండ్రులు తమ పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితమే తమ జీవితం అనుకుంటూ వాళ్ళే తమ సర్వసం అనుకోని, తమ కష్టం పిల్లలు పడకూడదని, తమ సుఖాల్ని సైతం వదులుకొని పగలనక రాత్రనక కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేసిన తలిదండ్రులకు వృధాప్యంలో వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి సేవలు చేయాల్సిందిపోయి ఎదురు తన తల్లిని చిత్రహింసలు పెట్టాడు ఒక కసాయి.

నవమాసాలు మోసి, కని, పెంచి తన కుమారుడిని ప్రయోజకుడిని చేసిందో ఓ తల్లి. వృద్ధాప్యంలో తన కుమారుడు తనను కంటికి రెప్పలా చూసుకుంటాడనుకుంది.కానీ ఆ కుమారుడి చేతిలోనే చిత్రహింసలకు గురై చనిపోతానని ఆమె ఊహించలేదు.రాజస్థాన్‌లోని షాజ్‌హాన్‌పూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.పక్షవాతంతో మంచం పట్టిన 82 ఏళ్ల తన తల్లిని లేపి చిత్రహింసలు పెట్టాడో పుత్రరత్నం.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

తల్లిని హింసించిన ఆ కసాయిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు.ఈ వీడియో బయటకు రావడంతో నిందితుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపామని తెలిపారు.నిందితుడు పరారీలో ఉన్నాడని అన్నారు.ఈ వీడియోను నిందితుడి మేనల్లుడు తీశాడని గుర్తించినట్లు చెప్పారు.నిందితుడి పేరు జోగేంద్ర చౌదరి అని, అతడు ఓ స్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు.తల్లిపై ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.