//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉత్తరప్రదేశ్‌లో స్విస్‌ జంటపై దాడి

Category : national

అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. శత్రువు ఇంటికి వచ్చిన పలకరింపుల కొదవ ఉండదు భారతదేశంలో. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది భారత్‌. ఇప్పుడు వారికే రక్షణ కరువైన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. యుపిలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన స్విట్జర్‌ల్యాండ్‌లోని లుస్సానే ప్రాంతానికి చెందిన క్వెంటీ జెర్మ్‌ క్లర్క్‌, మారీ డ్రోక్జ్‌ పై ఫత్తేఫూర్‌ సిక్రీలో కొంత మంది యువకులు దాడి చేశారు. వీరిని నడిరోడ్డుపై అతి దారుణంగా కర్రలతో, రాళ్ళతో కొట్టి గాయపరిచారు.

స్విస్‌ నుండి పర్యాటకులిద్దరూ గత నెల 30వ తేదీన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ చూడటానికి వచ్చారు. తాజ్‌మహల్‌ సందర్శించిన తరువాత దగ్గరలోని చారిత్రాత్మక ప్రదేశం ఫతేఫూర్‌ సిక్రీకి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. స్విస్‌కు చెందిన ఈ యువజంటపై ఆదివారం నాడు ఫతేపూర్‌ సిక్రీ వద్ద కొందరు యువకులు రాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన విషయం తెలిసిందే. స్థానిక యువకులు కొందరు ఈ జంటలోని యువతితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించిన సందర్భంలో వారు రైల్వే ట్రాక్‌పై పరుగులు తీస్తుండగా యువకులు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ జంటలో యువకుడికి తలపై తీవ్ర గాయాలు తగులగా యువతికి చేయి విరిగిందని, ఇద్దరికీ ఢిల్లీ ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఆసక్తి చూపనప్పటికీ పోలీసులు తమ సొంతంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని ఆగ్రాకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. దాడి చేసిన వారిలో కొంతమందిని గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్ట్‌ చేస్తామని పోలీసు ప్రతినిధి వివరించారు.

నివేదిక కోరిన సుష్మా యుపిలోని ఆగ్రాలో స్విజర్లాండ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులపై స్థానికులు దాడి చేసిన ఘటనకు సంబంధించి తనకు పూర్తి సమాచారం అందచేయాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ యుపి ప్రభుత్వానికి సూచించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారంతో నివేదిక అందించాలని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ జంటను తమ శాఖ అధికారులు పరామర్శించారని ఆమె వివరించారు.