//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒంటరి మహిళపై కామాంధుల దాడి

Category : national

రోజు రోజుకి దేశం లో ఆకతాయిలా చేష్టలు పెరిగి పోతున్నాయి. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల మహిళ భర్త నుంచి విడాకులు తీసుకొని ప్రతాప్‌ఘడ్ జిల్లా కొత్వాలీ గ్రామంలోని పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఒంటరిగా నివాసముంటోంది.

ఒంటరి మహిళపై కన్నేసిన ఆరుగురు దుండగులు రాత్రివేళ ఆమె ఇంటికి వచ్చి అత్యాచారం చేసేందుకు యత్నించారు. మహిళ ప్రతిఘటించడంతో ఆ కామాంధులు మహిళపై ఇనుపరాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మహిళ ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి తీవ్ర గాయాల పాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు.

దబాంగ్ గుడ్డు పాసీ, మదన్ పాసీలనే ఇద్దరు గూండాలు మరో నలుగురితో కలిసి మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించి దాడి చేసి కొట్టారని పోలీసులు చెప్పారు. ఇద్దరు ప్రధాన నిందితులు గుడ్డు, మదన్ లను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో గ్రామంలో పలువురు అమ్మాయిలపై ఈ గూండాలు అఘాయిత్యం చేశారని పోలీసులు చెప్పారు.