టేకాఫ్ అయిన కొంత సేపటికే ప్రాణాలు కోల్పోయారు.ఇరాన్లో ప్రయాణీకులతో వెళ్తున్న ఓ విమానం (ATR-72),ఘోర ప్రమాదానికి గురయ్యింది.ఆదివారం (ఫిబ్రవరి-18) టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న ఓ విమానం మధ్య ఇరాన్లో కూలిపోయింది.సెమిరామ్ టౌన్ దగ్గర్లోని కొండ ప్రాంతంలో విమానం కూలినట్లు సమాచారం.
పక్షం రోజుల వ్యవధిలో విమానం కూలిపోయిన ఘటన రెండోది.కూలిపోవడానికి ముందు ఈ విమానం పొలాల్లో ల్యాండయ్యేందుకు పొలాల్లో యత్నించినట్లు కొందరు ప్రత్యక్ష సాక్ష్యుల కథనంగా స్థానిక టెలివిజన్ ఒకటి పేర్కొంది.ప్రమాద సమయంలో విమానంలో 66 మంది ఉన్నారు.
టెహరాన్‌లో టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆ విమానం రాడార్ నుంచి తప్పిపోయింది.ఎమర్జెన్సీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా వాతావరణం సరిగా లేకపోవడంతో వెళ్లలేకపోయింది.టేకాప్ తీసుకున్న కొద్దీ సేపటికి మాస్కో సమీపంలో విమానం కూలిపోవడంతో 71మంది చెందారు.గత వారం రష్యాల్లోనూ ఇదే విధంగా ఓ విమానం కూలిపోయిన విషయం విదితం.