//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏటీఎమ్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు త్వరలోనే మాయం కానున్నాయా..?

Category : state national

నవభారతంలో డిజిటల్ టెక్నాలజీ పుణ్యమాఅని ఎన్నో కొత్త కొత్త వింతలు చోటు చేసుకోనున్నాయి. ఇంతవరకూ బ్యాంకు లావాదేవీలు సింహభాగం ఏటీఎమ్ లు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్నాయి. నీటి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చెప్పిన దాన్ని బట్టి చుస్తే ముందు ముందు ఏటీఎమ్, డెబిట్, క్రెడిట్ కార్డులు ఇక చరిత్రలో కలిసిపోనున్నాయి. 

పిహెచ్ డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యొక్క ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ను ప్రారంభిస్తూ కాంత్ పైవిధంగా అన్నారు. భారతదేశ అభివృద్ధి పథంలో టెక్నాలజీ ముఖ్యపాత్ర పోషించనున్నదన్నారు. ఇకపై బ్యాంకుకి వెళ్లి లావాదేవీలు జరపడం పూర్తిగా తగ్గిపోనున్నదని, దాని స్థానంలో డిజిటల్ వాలెట్ లు, బయోమెట్రిక్ విధానంతో బ్యాంకు లావాదేవీలు జరగనున్నాయని కాంత్ తెలిపారు.