//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రారంభమైన వాజ్‌పేయీ అంతిమ యాత్ర ...!

Category : politics national

మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ కాసేపటి క్రితం ఆరంభమైంది.

యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వం లాంఛనాలతో వాజ్‌పేయీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భరత జాతికి విశేష సేవలందించిన వాజ్‌పేయీ ఇక యమునా నదీ తీరాన సేద తీరనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌ షా వాజ్‌పేయీ అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. నెహ్రూ స్మారక స్థలం శాంతి వనం, లాల్‌బహుదూర్‌ శాస్త్రి స్మారకం విజయ్‌ ఘాట్‌ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్‌ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్‌లోనే జరిగాయి.

అంతకుముందు వాజ్‌పేయి నివాసం నుంచి భాజపా కార్యాలయానికి చేరుకున్న వాజ్‌పేయీ భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అగ్రనేత ఎల్‌.కె.అడ్వాణీ, పలువుకు కేంద్రమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ముఖ్యనేతలు నివాళులర్పించారు.