//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక సెలవు ... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత..!

Category : national state politics

రాజకీయ చాణ్యుక్యుడు , మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూశారు. గత కొంతకాలంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు.

మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం తో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో జీవనాధార వ్యవస్థపై ఉంచారు.

1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత మొత్తం ఆయనపైనే పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వాజ్‌పేయీ సేవలందించారు.

Related News