//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ ప్లాష్ న్యూస్‌.. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని..!

Category : politics

భార‌త్ మాజీ ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌ పేయిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఎయిమ్స్ లో చేరారని వైద్యులు చెప్పారు. ఎయిమ్స్‌ డైరెక్టర్ డా.రణ్‌ దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా డా. గులేరియా వాజ్‌ పేయికి వ్యక్తిగత ఫిజీషియన్‌గా ఉంటున్నారు.

అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 94 సంవత్సరాల వాజ్ పేయి మంచానికే పరిమితమయ్యారు. పార్టీకి చెందిన ఎటువంటి కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదు. రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న వాజ్ పేయి 1924లో జన్మించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. లక్నో లోక్ సభ స్థానం నుంచి 1991,1996,1998,1999, 2004 సంవత్సరాల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి వాజ్ పేయి. 2015లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్న అట‌ల్ బిహారీ వాజ్‌పేయికి లభించింది.