//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీనియర్ ఉద్యోగులపై వేటు వేయనున్న కాగ్నిజెంట్‌ సొల్యూషన్స్‌

Category : national business

కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సీనియర్ మేనేజ్ మెంట్ స్తాయిలో ఉన్న ఉద్యోగులపై వేటు వేయనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు ఉద్యోగం వదులుకొనేవారికి సుమారు 9 మాసాల జీతం ఇవ్వనుంది. వలంటరీ సెపరేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాగ్నిజెంట్. డిజిటల్ వైపుకు కంపెనీ అడుగులు వేస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు రెండవ త్రైమాసిక చివరినాటికి ఈ ప్రక్రియను ముగించాలని భావిస్తోంది.నాస్టాక్ లిస్టెడ్ కంపెనీ ఈ వార్తలను ధృవీకరించింది.డిజిటల్ మార్పులు, అధిక నాణ్యత స్థిరమైన వృధ్దిని సాధించే వ్యూహాంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది కాగ్నిజెంట్.ర్యాంక్ ల వారీగా ఉద్యోగులపై వేటు పడనుంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి ఉన్నతస్థాయి అధికారులు, బోర్డు సభ్యులు, వైస్ ప్రెసిడెంట్లు ఇందులో ఉన్నారు.

ఇందులో భాగంగా రిజైన్ చేసిన ఉద్యోగులకు కనీసం 9 మాసాల వేతనం పరిహారంగా చెల్లించనుంది కంపెనీ. దాదాపుగా మూడు నెలల నుండి ఉద్యోగులతో కంపెనీ చర్చలు జరుపుతోంది. కనీసం 40 లక్షల రూపాయాల జీతాన్ని అందుకొనే ఉద్యోగులు ఈ పథకం కిందకు వస్తారని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.కంపెనీని వదిలేయాలనుకొంటున్నవారికి మంచి అనుకూలమైన అవకాశాలను ఇస్తామని కంపెనీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు తన ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి నిపుణులైన ఉద్యోగుల ఎంపిక కూడ కొనసాగుతోందని కంపెనీ ప్రకటించింది.