//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ్యోతిష్యులా...దొంగలా

Category : national

విజయనగరం జిల్లా జయతి గ్రామంలో దొంగలు పడ్డారు. బిచ్చగాళ్లు, జ్యోతిష్కుల వేషధారణతో వచ్చి ఐదిళ్లలో చోరీ పాల్పడ్డారు. సుమారు 13 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 7.500 అపహరించుకుపోయారు. ఒకరిని నిర్బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.గ్రామస్థుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు బైక్‌పై గ్రామానికి వచ్చారు. ఒకరు చిలక జోష్యం చెబుతానని, మరో ఇద్దరు అదే వేషధారణతో గ్రామంలో తిరిగారు.తాళాలు వేసి ఉన్న ఐదిళ్లను ఎంచుకున్నారు. గెద్ద కృష్ణ ఇంటి తలుపులు పగులగొట్టిలోని ప్రవేశించారు.బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం తాడు, తులం చెవిరింగులు, 10 తులాల వెండి పట్టీలు, రూ.4వేలు దొంగిలించారు. గెద్ద అక్కునాయుడు ఇంట్లో రెండు తులాల చైన్‌, చెవిదిద్దులు, కాసులు మూడు తులాల ఆభరణాలు అపహరించారు. గెద్ద లక్ష్మి ఇంట్లో బంగారం తులం, చెవి దిద్దులు పావుతులం అపహరించారు. పాండ్రంకి శంకరరావు ఇంట్లో తులం బంగారం, రూ. 2500 దోచుకుపోయారు. మరొకరి ఇంట్లో చోరీ చేశారు.

ఒకరికి దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత పక్కనున్న అమరాయవలసలో నిందితుడు నామాలు జన్నియ్యను గ్రామస్ధులు పట్టుకున్నారు. ఆయనకు దేహశుద్ధి చేశారు. రామమందిరంలో నిర్భందించిన అనంతరం ఆండ్ర ఎస్‌ఐ ఎస్‌.భాస్కరరావుకు అప్పగించారు. అదుపులో ఉన్న నిందితుడు తన పేరు నా మాలు జన్నియ్య అని గజపతినగరం మండలం మరుపల్లి అని తొలుత చెప్పాడు. మరోసారితనది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని ఆలమూరు మండలం మరికి గ్రామమని మాటమార్చాడు. చుట్టపు చూపుగా పది రోజుల క్రితం మరుపల్లి వచ్చినట్లు వివరించాడు.

ఇద్దరు పరారీ జన్నియ్యను పట్టుకున్నప్పుడు మరో ఇద్దరు నిందితులు అక్కడేఉన్నట్లు తెలిసింది. పరిస్థితి గమనించి బంగారంతో వారు బైక్‌తో పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం కూడా వీరిలో ఒకరు గ్రామంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బుధవారం ప్రణాళికతో చోరీకిపాల్పడినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నారు. గ్రామానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. బాధితులనుంచి వివరాలు సేకరించారు. ఎస్‌ఐ ఎస్‌.భాస్కరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related News