Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంకా క్లారిటీ లేని కూటమి సీట్లు... మిత్రపక్ష పార్టీల పాట్లు

Category : politics

Telangana ఎన్నికల సమయం దగ్గర పడింది. తెలంగాణ ఎన్నికల్లో TRS ను గద్దె దింపడమే లక్ష్యంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి మహాకూటమి గా ఏర్పడినా కూటమి పార్టీలకు సీట్లపై క్లారిటీ లేదు. కాంగ్రెస్ 119స్థానాలకు గాను 95 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మిగిలిన 24స్థానాల్లో మిగతా పార్టీల్లో ఎవరికెన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపై రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. 14 స్థానాలను టీడీపీకి, మిగతా 10 స్థానాలను సిపిఐ, టీజెఎస్ లకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే టీజెఎస్ మాత్రం తమకు 11స్థానాలు కేటాయించాలని కోరుతుంది. ఎన్ని దఫాలు చర్చలు జరిగినా ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు.

ఇక మొదట సైలెంట్ గా ఉన్న సిపిఐ తమకు 4,5 అసెంబ్లీ స్థానాలు కావాలని పట్టు పడుతుంది . వాళ్లు అనుకున్న సీట్లు కేటాయించటానికి Congress సుముఖంగా లేదని తెలుస్తుంది. దీంతో సీపీఐ కూడా కాంగ్రెస్ వైఖరి పై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల గడువే ఉన్నప్పటికీ మహాకూటమిలో సీట్ల పంపకం విషయంలో వివాదం ఇంకా కొలిక్కి రాకపోవటంతో మహాకూటమి భవితవ్యం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో TRS పార్టీ సైలెంట్ గా తన ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతుంది. కూటమిలో మరిన్ని పంచాయితీలు పెట్టే ప్లాన్ చేస్తుంది. TRS ను ఓడించేందుకు ఏమో కానీ సీట్ల కోసం మాత్రం కూటమి పక్షాల పాట్లు అన్నీ ఇన్నీకావు.