18వ ఆసియా క్రీడలకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో తెరలేచింది. జకార్తా వేదికగా 18వ ఆసియాక్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ వేడుకలో భారత్ తరఫున జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా త్రివర్ణ పతాకంతో కవాతు చేశాడు. భారత బృందంలో 311 మంది పురుషులు, 260మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు.
పోటీలు ఆదివారం మొదలవుతాయి.సెప్టెంబర్ 2 వరకు సాగనున్న ఈ పోటీల్లో 45 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 11000 వేలమందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో 40 క్రీడల్లో 465 విభాగాల్లో పోటీ పడనున్నారు. ఆసియా క్రీడలకు ఈసారి భారత్ మంచి సన్నద్ధతతో ఉంది. షూటింగ్, హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో మనకు పతకాలు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.