//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ బాగుండాలని కోరుకుంటున్న అశోక్ గజపతిరాజు....!

Category : politics

అశోక గజపతి రాజు కేంద్ర మాజీ మంత్రి, ఈయన ఒక విషయం పై మీడియా తో మాట్లాడుతూ రాజకీయాల్లో చంద్రబాబు, వైయస్ రాజశేఖరరెడ్డి, ఇద్దరికిద్దరే అని సమాధానం ఇచ్చారు. ఇక జగన్ గురించి మాట్లాడుతూ , తన కొలీగ్ కుమారుడిగా వైసీపీ అధినేత జగన్ బాగుండాలనే తాను కోరుకుంటానని ఆయన తెలిపారు.

కానీ, ఆయన వెళ్తున్న దారి మాత్రం దేశానికి మంచిది కాదని చెప్పారు. ఆయన ఎంచుకున్న వైఖరి రాజకీయాలకే కాదు, వ్యక్తిగతంగా ఆయనకు కూడా మంచి చేయదని అన్నారు.

ప్రస్తుతానికి ఏపీ ప్రజల్లో సంతృప్త స్థాయి చాలా ఎక్కువగా ఉందని... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయమని అశోక్ తెలిపారు. రాష్ట్రానికి విభజన సమస్యలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అడిగింది, ఇస్తామని చెప్పింది జాతీయ పార్టీలేనని ఇవ్వాల్సిన బాధ్యత వాటిపైనే ఉందని అన్నారు. అభివృద్ధిలో ఏపీ అత్యుత్తమ స్థితిలో ఉందని దాన్ని కొనసాగిస్తూనే, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని చెప్పారు.

Related News