Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రధాని మోదీ పై నిప్పులు చెరిగిన అస‌దుద్దీన్ ఓవైసీ ....నీ డ్రామాలు ఇంకా ఆపు మోదీ అంటూ ట్వీట్.

Category : politics

ఇప్పటికే అనేక సందర్భాలలో ఎన్నో రాజకీయ విమర్శలకు , వివాదాలకు కేంద్ర బిందువు గా ఉంటూ వస్తున్న ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తాజాగా మరో ఘాటైన విమర్శ చేశాడు. తాజా గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహాత్మాగాంధీ నీ హత్య చేసిన నాథురామ్ గాడ్సే నిజమైన దేశ భక్తుడని ప్రశంసించిన ప్రజ్ఞాసింగ్ గాంధీజీని అవమానించారని, ఆమెను ఎన్నటికీ క్షమించబోనన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ తప్పు బడుతు ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా అస‌దుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ....మీ డ్రామాలిక ఆపండి. జాతీయ ప్రముఖులు గా ఉంటూ వస్తున్న మీరు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరిచే చర్యలను మీరే ప్రారంభించారను.

సాద్విత్వాన్ని తదుపరి దశకు మీరే తీసుకెళ్లారనీ. మీ ఆఫీసులో గాడ్సే తదితర కుట్రదారుల ఫొటోలు లేవా....? అని తన ట్వి ట్టర్‌ ఖాతా ద్వారా ప్రశ్నించారు. ప్రధాని మోదీ మీడియా సమావేశంపైనా ఎంఐఎం అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. @ పీఎంవో (ప్రధాని కార్యాలయం).. నైస్ ప్రెస్ కాన్ఫరెన్స్. మీరు ఊరకే కూర్చోవడానికి బదులుగా, ప్రశ్నలు స్వీకరించి ఉంటే బాగుండేది. మీరు అక్కడున్నది కేవలం దర్శనానికే తప్ప ప్రశ్నలకు జవాబివ్వడానికి కాదనీ. కచ్చితంగా ప్రతిఒక్కరూ ఎక్కడో ఓ చోట ప్రశ్నించడం మొదలుపెడతారను ఆయన పేర్కొన్నారు.