//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభుత్వ పాఠశాలలకు ఒకప్పటి గౌరవం తీసుకొచ్చిన కేజ్రీవాల్.. ఆనందం లో ప్రజలు...

Category : state politics

ఒక సామాన్యుడిగా, అన్న హాజారే శిష్యుడు గా సొంతగా అం ఆద్మీ పార్టీ స్థాపించి, పోటీ చేసిన తోలి ప్రయత్నం లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోయించిన నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకపోయినప్పటికీ అభివృద్ధి లో హౌరా అనిపిస్తున్నాడు.

ఇప్పుడు తన చూపు ఢిల్లీ కార్పొరేషన్ స్కూళ్ల వైపు పడింది. ఢిల్లీ కార్పొరేషన్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లలాగా , అంతకంటే, గొప్పగా తీర్చి దిద్దుతున్నారు. పరిసరాలు, ప్రాథమిక వసతుల్లోనే కాదు, బోధనలో కూడా కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వ పాఠశాలలు మించిపోవాలన్నది ఆయన కల.

ప్రభుత్వ పాఠశాలలు అన్ని కార్పొరేట్ స్కూళ్లకంటే తక్కువగా ఉండరాదని ఒక్కప్పటి గౌరవం ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావాలన్నది ఆయన ఆశయం అని చెప్పారు . 2016-17లో రాష్ట్ర బడ్జెట్ లో 22.8 శాతం నిధులు విద్యారంగాన్ని అభివృద్ధి పరిచేందుకు కేటాయించారు. మరే రాష్ట్రంలోను ఇంత భారీగా విద్యకు నిధులు కేటాయించలేదు. ఈ విషయంలో ఆల్ ఇండియా సగటు కేవలం 15.6 శాతమే నని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ మధ్యనే కేజ్రీవాల్ దలైలామాతోకలసి స్కూళ్లలో హ్యాపినెస్ కరికులమ్ ప్రవేశపెట్టారు.