//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ్యాన్‌బుకర్‌ ఫ్రైజ్‌ కు పోటీపడుతున్న అరుంధతీరాయ్‌

Category : national

అత్యుత్తమ రచనలకిచ్చే మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ కోసం ఈ ఏడాది వివాదాస్పదమైన ప్రముఖ భారతీయ రచయిత అరుంధతీరాయ్ పోటీపడుతున్నారు. 1997లో 'గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌' అనే రచనకుగాను ఈ అవార్డు పొందిన ఆమె ఈ సారి ''ది మినిస్ట్రీ ఆఫ్‌ అట్‌మోస్ట్‌ హ్యాపీనెస్‌" అనే రచనకుగాను బుకర్‌ప్రైజ్‌ కోసం పోటీపడుతున్నారు.

మొత్తం 144 రచనలను వడపోసి ప్రైజ్‌ కోసం పోటీపడుతున్న 13 రచనల జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. ఫిక్షన్‌ విభాగంలో అరుంధతీ రారుతోపాటు పాల్‌ ఆస్టర్‌ అద్భుత రచన '4 3 2 1', చారిత్రక ఇతివృత్తంగా కాల్సన్‌ వైట్‌హెడ్‌ రచించిన 'ది అండర్‌గ్రౌండ్‌ రైల్‌రోడ్‌', ఎమిటీ ఫ్రిడలండ్‌ రచన 'హిస్టరీ ఆఫ్‌ వోల్వ్స్‌', జార్జ్‌ శాండర్స్‌ ఊహాతీత రచన 'లింక్లన్‌ ఇన్‌ ది బర్డో'లు పోటీపడుతున్నాయి.

పాకిస్థాన్‌ రచయిత మోసిన్‌ హమీద్‌ రచించిన 'ఎగ్జిట్‌ వెస్ట్‌' అనే రచన కూడా జాబితాలో చోటు సంపాదించింది. ఈ 13 రచనలను వడపోసి ఆరు పుస్తకాల జాబితాను సెప్టెంబరు 13న విడుదల చేస్తారు. చివరగా అక్టోబరు 17న విజేతను ప్రకటిస్తారు. విజేతకు రూ.41 లక్షల నగదు బహుమతిని బుకర్‌ ప్రైజ్‌ కింద అందిస్తారు. 1969లో ఏర్పాటైన ఈ బహుమతి 2014 వరకూ బ్రిటన్‌ రచయితలకు మాత్రమే ఇచ్చేవారు. అనంతరం ఇంగ్లీషు రచనలన్నింటికీ వర్తింపజేశారు.