//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టిన అరుణ్ జైట్లీ....!

Category : national

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం 2019లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుందని 2018 ఆర్థిక సర్వే అంచనావేసింది. జీఎస్టీ వంటి పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో రియల్‌ జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది.

నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ సర్వేను సభలో ప్రవేశపెట్టారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కొత్తగా పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కూడా పెరిగినట్టు తెలిపింది. వచ్చే ఏడాది ఆర్థిక నిర్వహణ సవాల్‌గా నిలువనున్నట్టు రిపోర్టు చేసింది. గత ఆరేళ్లలో 2017-18 మధ్యకాలంలోనే ద్రవ్యోల్బణం సగటున కనిష్టంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది.

అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఆయిల్‌ ధరలపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తంచేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.