//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలుగు ప్రజల ఫై అరుణ్ జైట్లీ అవమానకర వ్యాఖ్యలు....!

Category : politics

తెలుగు రాష్ట్రాల ప్రజల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. తెలుగు ప్రజలను అవమానించేలా ఈ వ్యాఖ్యలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడటం వెనుక ప్రజలు భారీ ఎత్తున కరెన్సీని ఇళ్లలో దాచుకున్నారని, అందువల్లే కొరత ఏర్పడిందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

నిన్నసాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయం లో అక్కడికి వచ్చిన తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల కల్పించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బులు లేవని, దీంతో తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే అదనంగా డబ్బు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వెంటనే ఈ విషయం ఫై స్పందించిన జైట్లీ తాము ఇప్పటికే పంపించాల్సిన డబ్బు కన్నా చాలా అధికంగానే కరెన్సీ నోట్లను ఏపీ, టీఎస్ లకు పంపించానని చెప్పారు. అక్కడి ప్రజలు నోట్ల కట్టలను బ్యాంకు లాకర్లలో, ఇళ్లల్లో దాచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

Related News