//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరుణ్ జైట్లీ ఎన్నడూ మాట మార్చలేదు..ఇది ప్రజావిజయం...!

Category : politics

నిన్న జరిగిన అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్, అలాగే చంద్రబాబు నాయుడు గారి నిన్నఇచ్చిన స్టేట్ మెంట్ మీద జగన్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయం లో అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను జగన్ చెపుతూ అరుణ్ జైట్లీ గారు పాట మాటే చెప్పారు, దానిలో అయన తప్పేమి లేదు అని అన్నారు.

జగన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 8, 2016 అనుకుంటా మై మెమరీ గోస్ రైట్. ఇదే మాటమాట్లాడారనుకుంటా. జైట్లీ మాట్లాడితే, అర్థరాత్రి పూటే చంద్రబాబు మేలుకుని దాన్ని స్వాగతించారు. ఆపై వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలకు శాలువాలు కప్పారు. ఇవన్నీ గతం. అసెంబ్లీలో చంద్రబాబునాయుడు దీని గురించి విపరీతంగా పొగడుతూ, ఆనాడు ఆయన అన్న మాటలు ప్రత్యేక హోదా ముగిసిపోయిన ఘట్టం. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని ఆయన అన్న మాటలు, హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు ఏం మేలు జరిగిందని అడిగిన ప్రశ్నలు, ఆరోజు అసెంబ్లీలో మనమంతా చూశాం అని జగన్ చెప్పారు.

ఈరోజు అవే మాటలు అరుణ్ జైట్లీ నోటి నుంచి మళ్లీ వస్తే, అవేవో కొత్తగా వచ్చినట్టుగా రియాక్ట్ అయిపోయి ఓహోహోహో ఏదో జరిగింది. ఏదో చెప్పినాడు అని చంద్రబాబు ఓవర్ గా రియాక్ట్ అయిపోయి, యూటర్న్ తీసుకోని, తన మంత్రులను కేంద్ర కేబినెట్ నుంచి ఉపసంహరించుకుంటానని చెబుతూ చెప్పాడు.దీనికి కారణం ఏంటంటే ఇది ప్రజల విక్టరీ.

ప్రజల నుంచి ఒత్తిడి వస్తూ ఉంటే, ఎన్నికలు జరగబోతాయన్న నేపథ్యంలో, ప్రజల్లో తీవ్రంగా ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్ష బయట పడుతూ ఉన్న నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేస్తామని చెప్పి అల్టిమేట్టం ఇచ్చిన నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం మార్చి 21న పెడతామని డేట్ ఇచ్చిన నేపథ్యంలో, ప్రజల ఆకాంక్షలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తలఒగ్గాల్సి వచ్చింది అని అయన అన్నారు.