//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

Category : national

అరుణ్ జైట్లీ 2018-2019 పార్లమెంట్ ముఖ్య ప్రసంగాలు..

*సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చాం

* నిజాయితీ, పారదర్శక విధానాలతో ఎంతో మార్పు వచ్చింది

* మోదీ సంస్కరణలతో వృద్ధి రేటు పెరిగింది

* మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయి.

* తొలి మూడేళ్లలో సగటున 7.5 శాతం వృద్ధి.

* ఈ సంవత్సరం స్థూల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.

* ప్రస్తుతం భారత్ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ.

* ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగాం.

* అతి త్వరలో ఐదో ఆర్థిక శక్తి ఇండియానే.

* ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 శాతం పెరుగుతాయి.

* వ్యవసాయం, గ్రామీణ రంగాలకు పెద్దపీట.

* విద్యకు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం

* సౌభాగ్య పథకంతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం.

* 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే సర్కారు లక్ష్యం

* పలు పథకాలను నేరుగా లబ్దిదారులకే అందిస్తున్నాము.

* రైతుల ఉత్పాదకతను పెంచే చర్యలు చేపడుతున్నాం.

* వారికి దిగుబడిని, గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి.

* ధాన్యం పప్పు దినుసుల మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచాం.

* నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

* ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.

* నల్లధనాన్ని అరికట్టడంలో తొలి అడుగులు పడ్డాయి. మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం.

* పెట్టుబడులను పెంచుతూ, వృద్ధికి సహకరించేలా సంస్కరణలు తీసుకొస్తాం.

* తయారీ రంగంలో వృద్ధి రేటు తిరిగి పట్టాలెక్కింది.

* మాన్యుఫాక్చరింగ్ రంగంలో వృద్ధి రేటు ఇప్పుడు 8 శాతం.

* రెండు రోజుల్లో పాస్ పోర్టు మంజూరు చేయడం ఓ గొప్ప విజయం.

* ఒక్క రోజులోనే కంపెనీ రిజిస్ట్రేషన్ ను చేసి చూపించాం.

* ప్రత్యక్ష పన్నుల రాబడి ప్రయోజనం పేదలకు దక్కుతోంది.

* నగదు బదిలీలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం.

* దేశంలో అవినీతి తగ్గిపోయింది.

* గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి.

* డిజిటలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ఏర్పడింది.

* బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ కొత్త సంస్కరణలకు నాంది పలికింది.

* వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రధానంగా దృష్టి పెట్టాం.

* అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఒకే యంత్రాంగం ఏర్పాటు.

* గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ. 2 వేల కోట్లు.

* రైతుల కోసం జిల్లాల్లో క్లస్టర్ల ఏర్పాటు.

* వ్యవసాయ ఉత్పత్తుల కోసం పటిష్ఠమైన క్లస్టర్ విధానం.

* ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు.

* సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు మరింత ప్రాధాన్యం.

* సేంద్రీయ వ్యవసాయం చేసేలా మహిళా సంఘాలకు ప్రోత్సాహం.

* పర్ ఫ్యూమ్ ఆయిల్స్ కోసం రూ. 200 కోట్లు.

* ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు రూ. 1,400 కోట్లు.

* ఆపరేషన్ గ్రీన్ కోసం రూ. 500 కోట్లు.

* 42 మెగా ఫుడ్ పార్కులను పటిష్ఠం చేసేందుకు కృషి.

* ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో మరిన్ని రహదారుల అనుసంధానం

* మరో నాలుగేళ్లలో అన్ని గ్రామాలకూ పక్కా రహదారులు.

* 2017-18లో ఎగుమతులు 17 శాతం.

* వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సరళీకరణ.

* రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు.

* పాడి, ఆక్వా రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు.

* పశు సంవర్థక, ఆక్వా అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు.

* దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు.

* పేదలకు ప్రయోజనకరంగా ఉండేలా స్వచ్ఛ భారత్ అభియాన్.

* మహిళల హుందాతనాన్ని కాపాడుతున్న శౌచాలయాల నిర్మాణం.

* 2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ సొంత ఇల్లు.

* 2019 నాటికి మహిళా సంఘాలకు రూ. 75 వేల కోట్ల రుణాలు

* వెదురు పరిశ్రమ ప్రోత్సాహం కోసం రూ. 1,200 కోట్లు.

* నీటి వసతి లేని 96 జిల్లాల కోసం ప్రత్యేక నిధి.

* ఇప్పటికే 8 కోట్ల మంది మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు.

* జాతీయ జీవనోపాధి మిషన్ కోసం రూ. 5,750 కోట్లు.

* విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

* నాణ్యమైన విద్యా బోధన కోసం మరింత కృషి.

Related News