డేరాబాబా రికార్డుకు యోగి ఎసరు..!

Posted 3 months ago | Category : national

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం గిన్నీస్‌ రికార్డు సృష్టించనుంది. దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం సరయు నదీతీరంతో పాటు అయోధ్య నగరంలో ఏకంగా రెండు లక్షల మట్టి దీపాలు వెలిగించి డేరా అధినేత గుర్మీత్‌ సింగ్‌ సృష్టించిన రికార్డును బద్దలగొట్టనున్నారు. అత్యాచార కేసుల్లో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌.. 2016 సెప్టెంబర్‌ 23న హరియాణాలోని సిర్సా ప్రాంతంలో 1,50,009 దీపాలు వెలిగించి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం 'అయోధ్య దివ్య దీప్‌' ఉత్సవాల్లో భాగంగా గుర్మీత్‌ రికార్డును చెరిపేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా లేజర్‌ షోలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ రామ్‌ నాయక్‌లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. సరయు ఘాట్‌, రామ్‌కీ పౌరి ఘాట్‌, రామ్‌కథా పార్క్‌ అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ దీపాలను వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్‌సీసీ విద్యార్థులు వెలిగించనున్నారు. ఆ తర్వాత సీఎం, గవర్నర్‌తో పాటు పలువురు మంత్రులు సాయంత్రం 6.30 నిమిషాలకు నిర్వహించనున్న హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిపక్షాల విమర్శలు ఈ కార్యక్రమాలను నిర్వహించడంపై యోగి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఓ పక్క గోరఖ్‌పూర్‌లో ప్రాణవాయువు అందక ఎందరో చిన్నారులు మృత్యువాతపడుతుంటే ఇప్పుడు ఈ గిన్నీస్‌ రికార్డులు అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted 19 hours ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!