//single page style gallary page

ఎగ్ బ్యాంక్ తో పౌష్టిక ఆహార లోపాన్ని దూరం చేద్దాం

Posted 4 years ago | Category : state health editorial kids

హైదరాబాద్: వాల్మీకి ఫౌండేషన్ , శ్రీనివాస హాచరీస్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 సంస్థలు కలసి సంయుక్తముగా 'ఎగ్ బ్యాంక్' ను ప్రారంభించాయి. తొలివిడతగా 50,000 గుడ్లను జంట నగరాల్లోని వివిధ వృద్ధాశ్రమాలు, అనాధశరణాలయాలో ఈ 'ఎగ్ బ్యాంక్' ద్వారా కోడిగుడ్లను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో వాల్మీకి ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాల్మీకి హరికిషన్, శ్రీనివాస హాచరీస్ ఎం.డి సురేష్ రాయుడు చిట్టూరి, వాల్మీకి ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్ జాహ్నవి శ్రీ పేరంబదూరు, సినీ నిర్మాత డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ, రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్(ఎలెక్ట్) జె.అబ్రహం, ప్రత్యూష సపోర్ట్ సంస్థ మేనేజర్ శశాంక్ మండ పాల్గొన్నారు.

వాల్మీకి హరికిషన్ గారు మాట్లాడుతూ వాల్మీకి ఫౌండేషన్ లోని వాల్మీకి హృదయ్ ప్రాజెక్ట్ సుమారు 45 మంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తుంది. వారికి ప్రతి రోజు ఆహారము గుడ్లను అందించుటకొఱకు ఎంతో మంది దాతలను సంప్రదించడం జరిగింది. కొంతమంది దాతలు అంగీకరించినప్పటకి అవి ఒక వారానికి లేదా ఒక నెల కి మాత్రమే సరిపోయేవి. ఇటువంటి పరిస్థితులే మిగతా హోమ్స్ లోను గమనించిన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. దీనికోసం వివిధ హేచరీస్ సంప్రదించగా, SH గ్రూప్ కి చెందిన శ్రీనివాస హాచరీస్ వారు ముందుకొచ్చి దీనిలో భాగస్వామిగా చేరటంతో పాటు తొలివిడతగా 50,000 గుడ్లను అందించటం జరిగింది.రోటరీ క్లబ్ వారు కూడా స్పందించి ఈ కార్యక్రమం లో భాగస్వాములు అవ్వటమే గాక వివిధ సంస్థలను ఇందులో భాగస్వామ్యులు చేయటం కోసం కృషి చేస్తామని తెలిపారు.

ప్రముఖ సినీనటి సమంత ఆధ్వర్యములో నడుస్తున్న ప్రత్యూష సపోర్ట్ సంస్థ కూడా ఇటువంటి మంచి కార్యక్రమములో పాలుపంచుకోవడం తమకెంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. పౌష్టికాహార లోపాలున్న ఆరేళ్లలోపు పిల్లలు సుమారు 16 కోట్లమంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో ఇప్పటికీ అనేక మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడటం ఆందోళనకర అంశం.భారత దేశ జనాభాలో సుమారు 60 కోట్ల మంది పిల్లలు, పెద్దలు విటమిన్ మరియు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలు సుమారు 30 లక్షల మంది ఈ పౌష్టికాహార లోపం వల్ల చనిపోవడం జరిగింది.

ఇంకొక్క చిన్నారి కూడా ఈ పౌష్టికాహార లోపంతో చనిపోకుండా దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.అలాగే వివిధ కార్పోరేట్ సంస్థలు కూడా తమవంతు బాధ్యతగా స్పందించి ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరంఎంతగానో ఉంది అని వక్తలు అభిప్రాయపడ్డారు

ఉద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం జ‌గ‌న్ స‌ర్కారే..?

Posted 2 years ago | Category : state politics

ఉద్యోగుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం జ‌గ‌న్ స‌ర్కారే..?

వైసీపీలో ఉండేదెవ‌రు..? పోయేదెవ‌రు..?

Posted 2 years ago | Category : politics state

వైసీపీలో ఉండేదెవ‌రు..? పోయేదెవ‌రు..?

వైసీపీ స‌ర్కార్‌కు మ‌హిళా రైతు స‌వాల్‌..!

Posted 2 years ago | Category : state politics

వైసీపీ స‌ర్కార్‌కు మ‌హిళా రైతు స‌వాల్‌..!

తీహార్ జైలుకు చిదంబ‌రం..!

Posted 2 years ago | Category : state politics

తీహార్ జైలుకు చిదంబ‌రం..!

బ్రేకింగ్ న్యూస్ : టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు

Posted 2 years ago | Category : state politics

బ్రేకింగ్ న్యూస్  : టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు

TTD లో నిధుల గోల్‌మాల్.. ఐఏఎస్ రాజీనామా

Posted 2 years ago | Category : state

TTD లో నిధుల గోల్‌మాల్.. ఐఏఎస్ రాజీనామా

వైకాపా కి కొత్త అర్థం చెప్పిన టీడీపీ నేత..!

Posted 2 years ago | Category : politics state

వైకాపా కి కొత్త అర్థం చెప్పిన టీడీపీ నేత..!

ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదు... దేవినేని అవినాష్!

Posted 2 years ago | Category : politics state

ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదు... దేవినేని అవినాష్!

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇంత చిచ్చు రేపిందా?

Posted 2 years ago | Category : politics state

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇంత చిచ్చు రేపిందా?

ఏమిటీ రాక్షస పాలన... చంద్రబాబు!

Posted 2 years ago | Category : politics state

ఏమిటీ రాక్షస పాలన... చంద్రబాబు!

అడ్డంగా దొరికేసిన విజయసాయి రెడ్డి..!

Posted 2 years ago | Category : politics state

అడ్డంగా దొరికేసిన విజయసాయి రెడ్డి..!