ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

మగవారిపై అత్యాచారాలతో బ్రిటన్ మహిళల రికార్డు !

Posted 4 months ago editorial

ప్రపంచ వ్యాప్తంగా రేప్ వంటి లైంగిక అత్యాచారాలను మహిళలు ఎదుర్కొనవలసి వస్తున్నదని ఆందోళన వ్యక్తం అవుతున్నది. కానీ బ్రిటన్ లో మాత్రం మహిళలే బలవంతంగా పురుషులపై శృంగారానికి పాల్పడటం ఎక్కువవుతున్నదని వెల్లడవుతుంది.

బహుశా మొదటి సారిగా మగువలు మగవారిపై జరిపే ఇటువంటి `అత్యాచారం' గురించి తాజాగా ల్యాంకస్టెర్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తి గల విషయాలు వెలుగుచూశాయి.  మగవారిని లొంగదీసుకుని, బలవంతంగా శృంగారానికి పాల్పడటం కోసం బ్లాక్‌మెయిల్‌ చేయడం, బెదిరించడం, దూషించడం, వదంతులు ప్రచారం చేయడం, మీ అనుబంధాల్లో చిచ్చు పెడతామని హెచ్చరించడం వంటి పలు వ్యూహాలను మగువలు అనుసరిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడైనది.

 కొన్ని సందర్భాల్లో బలప్రయోగం చేసి, ఆయుధాన్ని ఉపయోగించి మరీ మహిళలు ఇలాంటి చర్యకు పాల్పడుతున్నారని ఈ అధ్యయనం తెలిపింది. సమ్మతి లేకుండా డ్రగ్స్‌ ఇవ్వడం కూడా ఇలాంటి వ్యూహాల్లో భాగంగా ఉందని యూనివర్సిటీ పేర్కొంది. సాధారణ పరిభాషలో ఇటువంటి సందర్భాలను 'రేప్‌'గా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలు ఇలాంటి ఘటనలను రేప్‌గా గుర్తించడం లేదు.

 ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం చాలాచోట్ల మహిళలపై బలవంతపు శృంగారానికి  పాల్పడితే నేరంగా పరిగణిస్తారు గాని అదే మగువలు పురుషులపై పాల్పడితే ఎటువంటి నిబంధనలు లేవు. సమ్మతి లేకుండా ఇలాంటి ఘటనలు జరిగినా అవి అత్యాచార నేరం కిందకు రావడం లేదని, ఈ నేపథ్యంలోనే `ఫోర్సెడ్‌ టు పెనెట్రేట్‌' అనే పదాన్ని సృష్టించామని ల్యాంకస్టెర్‌ యూనివర్సిటీకి చెందిన సియోభాన్‌ వీరె తెలిపారు. "అత్యాచార నేరాన్ని పురుషుడు చేయగలడు. ఫోర్సెడ్‌ టు పెనెట్రేట్‌  కేసులలో బాధితుడి సమ్మతి లేకుండా నేరస్తురాలు లైంగిక చర్యకు పాల్పడుతుంది" అని ఆమె చెప్పారు.

పురుషులపై మహిళల లైంగిక హింసకు సంబంధించిన ఘటనలు చాలావరకు  రహస్యంగానే ఉంటున్నాయి. ఎందుకంటె పురుషుల కన్నా మహిళల శరీరాకృతి బలహీనంగా ఉంటుంది కాబట్టి వారు బలప్రయోగం చేయలేరన్న అభిప్రాయం సాధారణంగా ఉంటున్నది. మహిళలతో శృంగారం పురుషులు ఎల్లప్పుడు ఆస్వాదిస్తారన్న అపోహ ఇందుకు కారణమని ఆమె వివరించారు.

Most Read