ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

21 ఏళ్లుగా ఒక చీరకూడా కొనని సంపన్న మహిళ

Posted 4 months ago editorial

ఆడవారికి చీరలు కొనడం అంటే సరదా. అవసరం ఉన్న, లేకపోయినా కొత్త చీర చూస్తే కొనకుండా ఉరుకోలేరు. అందులో సంపన్నులైతే వేరే చెప్పనవసరం లేదు. ఇళ్లల్లో బీరువాలు నిండా చీరలే కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో అత్యధికం అసలు ఒకసారి కూడా కట్టుకొనే చీరలు, ఒకటి-రెండు సార్లు మాత్రమే కట్టుకున్న ఖరీదైన డిజైనర్‌   చీరలు ఉంటాయి.

భారత దేశంలో సంపన్న మహిళలో  ఒకరైన ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుధా మూర్తి మాత్రం ఇందుకు  గత 21ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుక్కోలేదట. అయితే అందుకు కారణం చీరలు కొనడాన్ని ఆమె కాశీలో వదిలేశారట. "పవ్రిత స్నానం కోసం నేను 21ఏళ్ల క్రితం కాశీకి వెళ్లాను.

ఎవరైనా కాశీకి వెళ్తే అక్కడ తమకు ఇష్టమైనదాన్ని వదిలేస్తుంటారు. అలాగే నేను షాపింగ్‌.. ముఖ్యంగా చీరలు కొనడాన్ని వదిలేశాను"  అని చెప్పారు.  అప్పటి నుంచి అత్యవసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. చీరలు కొనడం మానివేయడంతో ఏమాత్రం బాధపడటం లేదని కూడా పేర్కొన్నారు. అందుకు తనకు చాలా ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు చెప్పారు.

అయితే తనకు, తన భర్తకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టమని సుధామూర్తి చెప్పారు. ఇప్పటికే వారి వద్ద  రెండు లక్షలకు పైగా పుస్తకాలున్నాయి. అంతేగాక, పుస్తకాలు అరువు ఇచ్చేందుకు వీరు ఒప్పుకోరట. "ప్రతి ఒక్కరూ మరొకరి నుంచి పుస్తకాలు అప్పు తీసుకుని చదివితే.. ఒక రచయితలు ఎలా బతుకుతారు. రచయితలు పుస్తకాలు అమ్మడం ద్వారా మాత్రమే సంపాదిస్తారు. అదే విషయాన్ని నేను భర్తకు చెప్పాను. అప్పటి నుంచి మేం పుస్తకాలు ఎవరికీ ఇవ్వట్లేదు" అని సుధామూర్తి చెప్పారు.

Most Read