Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

40వేల కోట్లతో ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు

Posted 3 months ago | Category : national

సరిహద్దుల్లో సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు భారత సైన్యం సిద్ధమవుతున్నది. దేశ సరిహద్దుల్లో పాక్, చైనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ మేరకు ప్రణాళికలు వేస్తున్నది.

ప్రస్తుతం సైనికులు వినియోగిస్తున్న పురాతనకాలం నాటి ఆయుధాల స్థానంలో ఆధునికమైనవి అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. పదాతిదళ ఆధునీకరణలో భాగంగా రూ.40వేల కోట్లను వెచ్చించి తక్కువ బరువైన మెషిన్‌గన్స్, యుద్ధంలో వాడే చిన్నతుపాకీ (బ్యాటిల్ కార్బైన్స్), యుద్ధ రైఫిళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. 7 లక్షల రైఫిళ్లను, 44 వేల లైట్‌మెషిన్ గన్(ఎల్‌ఎంజీ)లను, దాదాపు 44,600 చిన్న తుపాకులను కొనుగోలు చేయాలని ఆర్మీ నిశ్చయించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే రెండోఅతిపెద్ద పదాతిదళం (స్టాండింగ్ ఆర్మీ) కలిగిన దేశంగా పేరుగాంచిన భారత్.ఇప్పుడు సైన్యానికి వివిధ రకాల ఆధునిక ఆయుధాలను అందించేందుకు అడుగులు వేస్తున్నది. ఈ ప్రక్రియను త్వరగా చేపట్టేందుకు వీలుగా వివిధ చిన్న ఆయుధాలను, ముఖ్యంగా ఎల్‌ఎంజీల తయారీలో వేగం పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు సమాచారం పంపించింది. ఇషాపూర్‌లోని రైఫిల్ పరిశ్రమలో తయారుచేసిన యుద్ధ రైఫిల్స్.. ఫైరింగ్ పరీక్షల్లో విఫలంకావడంతో గత జూన్‌లోనే వాటిని ఆర్మీ తిరస్కరించింది.

ఆయుధాలు ఎలా ఉండాలో ఆర్మీ ఖరారు చేయకపోవడంతోపాటు వివిధ కారణాలతో కొంతకాలంగా ఆయుధాల సేకరణ అనేది ఆలస్యమవుతూ వస్తున్నది. సైన్యానికి 7.62 ఎంఎం రైఫిళ్లు 7 లక్షల వరకు కావాలి. వీటిని ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో సైనికులకు అందించనున్నారు. 44,600 చిన్న తుపాకీలను సేకరించేందుకు జూన్‌లోనే ఆర్మీ ప్రాథమిక ప్రక్రియను ప్రారంభించింది.ఎల్‌ఎంజీలు, యుద్ధ రైఫిళ్లు, చిన్న తుపాకుల కోసం మొత్తం ఖర్చు రూ.40 వేలకోట్లు దాటుతుందని ఆర్మీ అధికార వర్గాలు తెలిపాయి. ఆయుధాలకు సంబంధించిన ప్రాజెక్టుపై చర్చించేందుకు ఈ వారంలో వాటాదారులతో సమావేశం కావాలని రక్షణశాఖ సెక్రటరీ తెలిపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పదాతిదళ ఆధునీకరణ అంశంపై ఇటీవల జరిగిన ఆర్మీ కమాండర్ల సదస్సులో విస్తృతంగా చర్చించారు. దేశ సరిహద్దుల్లో పొంచిఉన్న ముప్పు నుంచి బయటపడేందుకు ఆధునిక ఆయుధాలు అవసరమని అభిప్రాయానికి వచ్చారు.ఆయుధాల ఆధునీకరణ అనేది ప్రభుత్వ ప్రాధాన్య అంశమని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. లోపాలను సరిదిద్దుకుంటూ పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి