ఈ సంవత్సరం ఇద్దరు తెలుగు క్రీడాకారులు వి. జ్యోతి సురేఖ (విలువిద్య), సాకేత్ మైనేని (టెన్నిస్) అర్జున అవార్డులను పొందారు. 2017 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న ఇద్దరికి, అర్జున పురస్కారాలు 17 మందికి, ఉత్తమ శిక్షకులకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డులు ఏడుగురికి ప్రకటించింది. వీటితో పాటు ముగ్గురికి ద్యాన్‌చంద్ అవార్డులను కూడా ప్రభుత్వం ప్రకటించింది.
రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి పారాలింపియన్, జావెలెన్ త్రోయర్ దేవేంద్ర జజారియా, హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లను ఎంపికచేసింది. ద్రోణాచార్య అవార్డులను ఆర్.గాంధీ (మరణానంతరం- అథ్లటిక్స్ విభాగంలో), హీరానంద్ కటారియా (కబడ్డీ), జీఎస్ఎస్వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి, పీఏ రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్‌లాల్ (రెజ్లింగ్)లను ఎంపికచేసింది. అలాగే భూపేందర్ (అథ్లెట్), షాహిద్ హకిన్ (ఫుట్‌బాల్), సుమరై టెటె (హాకీ)లకు ధ్యాన్‌చంద్ అవార్డులను ప్రకటించింది.
అర్జున అవార్డులకు ఎంపికైన వారిలో మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, క్రికెటర్ పుజారా, టేబుల్ టెన్నీస్ క్రీడాకారుడు అమల్‌రాజ్, పారా అథ్లెట్ మరియప్పన్, కుష్బీర్ కౌర్ (అథ్లెటిక్స్), అరోకియా రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేందర్ సింగ్ (బాక్సింగ్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), ఎస్ఎస్పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్‌సింగ్ (కబడ్డీ), పీఎన్ ప్రకాశ్ (షూటింగ్), సత్యవ్రత్ కడియన్ (కబడ్డీ), పారా అథ్లెట్ వరుణ్‌సింగ్ భాటిలు ఉన్నారు.