//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మీరు సిద్ధమా?

Category : state politics editorial

ఆంధ్రప్రదేశ్ లో జనం లొంచి పుట్టుకువచ్చిన జనసేన పార్టీ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నడూ లేని విధంగా జనసేన ఎంపిక విధానాలు జరుగుతున్నాయి. డబ్బుతో కానీ,కులంతో కానీ సంబంధం లేకుండా జనసేన పార్టీ రాజకీయాల్లో నూతన మార్పుకు శ్రీకారం చుట్టింది.జనసేన తరపున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనేవారిని గుర్తించడానికి ఆ పార్టీ ఇప్పటికే ఎంపిక ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే.అనంతపురం జిల్లా నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉత్తరాంధ్రలో తదుపరి ఎంపికలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.స్పీకర్‌(వక్త), అనలిస్ట్‌/కంటెంట్‌ రైటర్‌ విభాగాలకు ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని కోరుతూ చిరునామా(యుఆర్‌ఎల్‌)ను అందించారు. 06-05-17 నుంచి 13-05-17 రాత్రి 8గంటల వరకు దరఖాస్తులు పంపవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి సుమారు 20000 అప్లికేషన్స్ రావచ్చనని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అనుకుంటున్నారు.జనసేన ఎంపిక ప్రెస్ నోట్ విడుదలైన రోజు 4000 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు.అందిన సమాచారం ప్రకారం ఈ నెల రోజుల్లో ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి జూన్, జులై నెలల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నారు.