ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటూ ప్రపంచాన్ని చూడొచ్చు. అదెలా అంటారా ...గూగుల్ ఎర్త్ ఈ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. హెడ్సెట్ పెట్టుకొని గూగుల్ ఎర్త్‌ను తెరిస్తే దీనిలో ఆధునీకరించిన వర్చువల్ రియాలిటీ (వీఆర్) సదుపాయం ప్రపంచంలో ఏ చిరునామానైనా 3డీ రూపంలో చూపిస్తుందట. ఆ ప్రాంతంపై తేలే అనుభూతిని కూడా కలిగిస్తుందట. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వీఆర్ తన బ్లాగ్‌లో తెలిపింది. ‘వీఆర్‌లో చిరునామా లేదా ప్రాంతం పేరు టైప్‌చేస్తే చాలు. హెడ్సెట్ సాయంతో ప్రాంత 3డీ నమూనాను చూడొచ్చు’అని గూగుల్ ఎర్త్ ప్రోడక్ట్ మేనేజర్ జోన్నా కిమ్ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని టేబుల్ మౌంటెయిన్, అర్జెంటీనాలోని పెరిటో మరీనో మంచు నది సహా 27 ప్రముఖ ప్రాంతాల నమూనాలను దీనిలో ప్రత్యేకంగా సిద్ధంచేసినట్లు వివరించారు. ‘కొత్త సదుపాయంతో ప్రముఖ నగరాలు, కట్టడాలపై ఎగరొచ్చు. కొత్త ప్రాంతాలను అన్వేషించొచ్చు’అని కిమ్ పేర్కొన్నారు. ఇక మనదే ఆలస్యం. త్వరగా గూగుల్ ఎర్త్ లోకి వెళ్ళేద్దాం....నచ్చిన ప్రాంతాన్ని చూసేద్దాం.