//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ పార్టీతోనే వీరందరు కలుస్తారా..?

Category : national politics

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహాలు అందరిని ఏకం చేసేవి గా ఉన్నా..మూడో ఫ్రంట్ కి మాత్రం అడుగులు పడటం లేదు. బిజెపి వ్యతిరేక ప్రధాన పార్టీలు అన్ని కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఎన్సీపి అధినేత శరద్ పవర్ ఇదే విషయాన్నీ ఆమెకి చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అటు ఉత్తరాదిన కీలకమైన ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీ తో ఉన్న సంబంధాల మేరకు ఆయన కూడా కాంగ్రెస్ తో కలిసి పని చెయ్యాలని భావిస్తున్నారట.

‘దేశంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మెజారిటీ స్థానాల్లో మేం బీజేపీతో పోటీపడుతున్నాం. బీజేపీ బలం లేని చోట్ల కూడా కాంగ్రెస్‌ ఉనికి ఉన్నది. కొన్ని పరిణామాల వల్ల మా పార్టీ దెబ్బతిన్నది. మళ్లీ పైకి లేచే శక్తి కాంగ్రెస్ కు ఉంది. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. కాలం అన్నీ నిర్ణయిస్తుంది.. ఇక మీదట జరగబోయే కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరు చూశాక మీకు తెలుస్తుంది. మీరు ఏర్పాటు చెయ్యాలనుకున్న ఫ్రంట్ వలన బిజెపికి ప్రయోజనం చేకూరుతుంది. “ అంటూ మమత కి సోనియా స్పష్టం చేసారట. గురువారం మమత సోనియా గాంధీతో భేటి అనంతరం చేసిన ఈ వ్యాఖ్యలు మమత ఆలోచనకు సోనియా గండి కొట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Related News