//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గాంధీజీ హంతకులు మరొకరున్నారా ? ఆయనకు తగిలిన నాలుగో బుల్లెట్ ఎవ్వరిది ?

Category : national

జాతిపిత మహాత్మ గాంధీ ని 1948 జనవరి 30న ఢిల్లీ లోని బిర్లా మందిర్ వద్ద నాథురాం గాడ్సే అనే వ్యక్తి కాల్చడంతో, మూడు బుల్లెట్ దెబ్బలు తగిలి మరణించారని అందరికి తెలిసిందే. గాడ్సే నుండి స్వాధీనం చేసుకున్న పిస్టల్ లో ఏడు బుల్లెట్లు ఉండగా, వాడకుండా మిగిలిన నాలుగు బుల్లెట్ లను పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ విషయమై గాడ్సేతో పాటు, కుట్రలో ఆయనతో పాలుపంచుకున్న నారాయణ ఆప్టే ను 1949 నవంబర్ 15న ఉరి కూడా తీశారు. అయితే వాస్తవానికి గాంధీజి శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని, అటువంటప్పుడు గాడ్సే కాకుండా మరో వ్యక్తి కూడా కాల్పులు జరిపే అవకాశం ఉన్నదంటూ దాఖలైన పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్ట్ పరిశీలనలో ఉంది. 

ముంబైకు చెందిన పరిశోధకుడు, అభినవ్ భారత్ ట్రస్టీ డా. పంకజ్ ఫడ్నిస్ దాఖలు చేసిన ఈ పిటిషన్ లో గాంధీజీ హత్యలో మరింత విస్తృతమైన కుట్రను బహిర్గతం చేయవలసి ఉన్నదని, అందుకోసం మరో విచారణ కమీషన్ ను నియమించాలని కోరారు. గాంధీ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని చెప్పడం కోసం అప్పుడు పత్రికలలో వచ్చిన పలు కథనాలను ఆయన సాక్ష్యాలుగా కోర్ట్ ముందు ఉంచారు. 

ఈ విషయమై 1966లో నియమించిన జస్టిస్ జె యల్ కపూర్ కమీషన్ గాంధీజీ హత్యలో నిమగ్నమైన పూర్తి కుట్ర కోణాన్ని వెల్లడి చేయలేక పోయినదని ఫడ్నిస్ భావిస్తున్నారు.  ఈ కేసులో నిందితులు కాకుంగా ప్రపంచంలో మరెవ్వరికైనా ఈ కుట్ర గురించి ముందే తెలుసా ? హత్యా చేయబోతున్నారని తెలుసా .. అని కూడా లోతుగా దర్యాప్తు చేయవలసి ఉన్నదని చెప్పారు. 

పాకిస్థాన్ అధినేత జిన్నా తో కలసి గాంధీజీ రెండు దేశాల ప్రజల మధ్య సామరస్య ధోరణి కలిగించడం కోసం పాకిస్థాన్ పర్యటనకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఈ హత్య జరిగిందా అనే అంశం కూడా కొత్త కమీషన్ పరిశీలన అంశాలలో ఉండాలని ఫడ్నవిస్ కోరారు.