//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ.. ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే..!

Category : movies

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. 2018 సంవ‌త్స‌రంలో సెకండాఫ్‌లో రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్‌లో అతిపెద్ద సినిమా ఇది. బాక్సాఫీసు వ‌ద్ద భారీ అంచ‌నాల‌తో అక్టోబ‌ర్ 10న ప్రీమియ‌ర్ షోల‌తో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవ‌రాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

అయితే, సోమ‌వారం నాడు ఈ చిత్రం సెన్సార్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది. యు బై ఏ స‌ర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఇక ఓవ‌రాల్‌గా ర‌న్ టైమ్ 2 గంట‌లా 30 నిమిషాల‌కు అటూ.. ఇటుగా ఉంటుంద‌ని స‌మాచారం సెన్సార్ బోర్డు స‌భ్యుల స‌మాచారం. సెన్సార్ స‌భ్యుల నుంచి సినిమాకు వ‌స్తున్న టాక్ కూడా అద్దిరిపోయే లెవ‌ల్ల‌లో ఉంద‌నే చెప్పాలి.

ఓవ‌రాల్‌గా స్టోరీ లైన్‌ను రివీల్ చేయ‌కున్నా.. దాదాపుగా మెయిన్ హైలెట్ విష‌యాల‌న్నింటిని సెన్సార్ బోర్డు స‌భ్యులు చెప్పేశారు. సినిమా మొద‌టి ప‌దిహేను నిమిషాలు, చివ‌రి ప‌ది హేను నిమిషాలు పూర్తిగా త్రివిక్ర‌మ్ మార్క్ డైలాగ్స్ అండ్ స్ర్కీన్‌ప్లేతో తెర‌కెక్కుతుంద‌ని, మ‌ధ్య‌లో వ‌చ్చే చాలా సన్నివేశాలు ఎన్టీఆర్ మార్క్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయ‌ని చెబుతున్నారు.

ఇక ఇంట‌ర్‌వెల్‌కు వ‌చ్చేస‌రికి, ఇంట‌ర్‌వెల్‌కు ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్‌.. సెకండాఫ్‌లో కొంత స‌మ‌యం త‌రువాత యాక్ష‌న్ ఎపిసోడ్స్ బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్స్ అని చెబుతున్నారు. ఇక‌, ఈ చిత్రం ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన‌ప్ప‌టికీ ఎమోష‌న‌ల్‌గా రైడ్‌గా సినిమా కొన‌సాగుతుంద‌ని, ప్రేక్ష‌కులు సినిమాలో ఇన్వాల్వ్ అవ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టినా.. త‌రువాత మాత్రం పూర్తిగా సినిమాలో లీన‌మైపోయి.. సినిమా చూసే విధంగా స్ర్కీన్‌ప్లేతో ఆక‌ట్టుకున్నాడ‌ట త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.

మొద‌టి 15 నిమిషాల క‌థ కొంచెం క‌న్ఫూజ‌న్‌ను క్రియేట్ చేసిన‌ప్ప‌టికీ, ఫ‌స్టాఫ్ ఎండింగ్ స్టేస్‌కు వ‌చ్చేస‌రికి ప్రేక్ష‌కులు సినిమాలో పూర్తిగా లీన‌మ‌వుతార‌ని సెన్సార్ బోర్డు స‌భ్యులు చెబుతున్నారు.

ఇక హైలైట్స్ విష‌యానికొస్తే, ముందుగా చెప్పిన‌ట్టే మొద‌టి అర్థ‌భాగంలో వ‌చ్చే ఫైట్ సీన్‌, అలాగే సెకండాఫ్‌లో వ‌చ్చే ఫైట్ సీన్స్ బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్స్ అని, మాస్ ఆడియ‌న్స్ ఆ సీన్ల‌కు ఉర్రూత‌లూగ‌డం ఖాయ‌మ‌ని సెన్సార్‌బోర్డు స‌భ్యులు చెబుతున్నారు.

అలాగే, ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సినిమాను మ‌రిపించే విధంగా స‌టిల్ యాక్టింగ్‌తో ఎన్టీఆర్ ఆక‌ట్టుకున్నాడ‌ని, యాక్ష‌న్ సీన్స్ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి ఆది, సింహాద్రి చిత్రాల‌ను మైమ‌రిపించే విధంగా అద్భుత‌మైన యాక్ష‌న్ సీన్స్‌తో దున్నేశాడ‌ని, ఇక సిక్స్ ప్యాక్ ఎపిసోడ్ కూడా అద్దిరిపోయే విధంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాకు ప్ల‌స్ పాయింట్ అని, పాట‌లు శ్రోత‌ల‌ను ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకుంటాయ‌ని చెబుతున్నారు. ఓవ‌రాల్‌గా మొద‌టి అర్థ‌భాగంలో ప్రేక్ష‌కులు లీన‌మ‌వ‌డానికి కొంత స‌మయం ప‌ట్టినా సెకాండ్ మాత్రం సినిమాకు ఆయువుప‌ట్టు అని చెబుతున్నారు సెన్సార్ స‌భ్యులు. ఓవ‌రాల్‌గా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో వ‌చ్చిన అన్ని చిత్రాల‌కంటే బెస్ట్ మూవీగా డిక్లేర్ చేయ‌డంతోపాటు.. ఈ సినిమాకు తాము ఇచ్చే రేటింగ్ 4.0 అంటూ మార్కుటు కూడా వేసేశారు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేసే అవ‌కాశం పుష్క‌లంగా ఉంద‌ని చెబుతున్నారు సినీ విశ్లేష‌కులు.

అలాగే, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అజ్ఞాత‌వాసి నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికీ అద్భుత‌మైన కంబ్యాక్‌ను ఈ సినిమాతో అందుకోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇది ఓవ‌రాల్‌గా సినిమా సెన్సార్ బోర్డు స‌భ్యుల‌న ఉంచి వినిపిస్తున్న టాక్‌. ఇక కామ‌న్ ఆడియ‌న్స్‌, అలాగే, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఇలా ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకోవ‌డానికి అక్టోబ‌ర్ 10న ప్రీమియ‌ర్ షోల‌తో విడుద‌ల‌వుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా ఎంత వ‌ర‌కు అంద‌రి అంచ‌నాల‌ను అందుకుని నిల‌బ‌డ‌గ‌లుగుతుందో వేచి చూడ‌క త‌ప్ప‌దు.