Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వేట మొదలైంది అరాచకానికి అమ్మమొగుడు

Category : movies

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వీర రాఘవ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. సినిమా అంతా తారక్ తన భుజాన వేసుకుని నడిపించాడు. త్రివిక్రం పెన్ పవర్ కు ఎన్.టి.ఆర్ నటన తోడైతే ఎలా ఉంటుందో దానికి తగినట్టుగా సినిమా ఉంది. ఇక హీరోయిన్ పూజా హెగ్దె కూడా మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.

యూ.స్. ప్రీమియర్ కలెక్షన్స్ లో ‘అరవింద సమేత’ ఇప్పటికే తారక్ బెస్ట్ రికార్డును తిరగరాసింది. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం అరవింద $721 ,077 కలెక్షన్స్ సాధించింది. సాయంత్రం లోపు టోటల్ ప్రీమియర్ కలెక్షన్స్ $825,000 నుండి $850,000 వరకు ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఇది తారక్ కెరీర్ లో ది బెస్ట్ ‘యూ.స్. ప్రీమియర్ రికార్డు’. అరవింద సమేత కి ముందు, జై లవ కుశ $589,000 కల్లెక్షన్స్ తో ఎన్టీఆర్ బెస్ట్ రికార్డుగా ఉండేది. వీకెండ్ లో విడుదల కానప్పటికీ, యూ.స్. లో వచ్చిన రెస్పాన్స్ చుస్తే ఎన్టీఆర్డ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమాగా అరవింద సమేత రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.