//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

220 కోట్ల కలెక్టన్స్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్న యంగ్ టైగర్ ......!

Category : movies

ఇప్పటివరకు రాయలసీమ నేపథ్యం లో ఇంతవరకు చాలా సినిమాలు వచ్చాయి . గతం లో ఇదే రాయలసీమ నేపథ్యం లో వచ్చిన సినిమాలన్నీకూడా బాక్స్ ఆఫీస్ కి పట్టిన దుమ్ముని దులిపేసాయి . ఒక దశాబ్ద కాలం క్రితం వచ్చిన బాలకృష్ణ నరసింహనాయుడు , సమరసింహా రెడ్డి ఇండస్ర్టీ ని షేక్ చేసాయి . ఇప్పటికి , ఎప్పటికి ఫ్యాక్షన్ స్టోరీ అంటే ఎవర్ గ్రీన్ . తెర ఫై ఫ్యాక్షన్ లీడర్స్ ని చూస్తే పంచలు తడుపుకునే వారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు .

ఇప్పుడు ఇదే కోవలో చాలా కాలం తరువాత పూర్తిగా ఫ్యాక్షన్ స్టోరీ తో తెరకెక్కిన చిత్రం అరవిందసమేత . ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించాడు అనడంకంటే ప్రాణం పెట్టి జీవించాడు అని చెప్పాలి . సినిమాలో తారక్ చూపించే అభినయం , నటన ఈ సినిమాకి మరో పెద్ద అసెట్ గా మారింది . ఇదే సినిమాని రికార్డ్ ల వర్షం కురిపించడానికి దోహద పడింది . ముఖ్యంగా ఈ సినిమా లో ఎన్టీఆర్ ఎమోషనల్ సీన్స్ లో చూపే నటన , సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ఇప్పటికే దాదాపుగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డ్స్ ని తుడిచిపెట్టింది . తండ్రి చనిపోయిన బాధలో కూడా కేవలం ఐదు రోజుల గ్యాప్ లో సినిమా షూటింగ్ కి వెళ్లి , సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావడానికి దోహదపడ్డాడు ఎన్టీఆర్ .

ఇక పొతే రాయలసీమ నేపథ్యం అంటేనే ఫ్యాక్షన్ , అంతుచిక్కని రక్త పాతం అనుకునే వారికీ , ఈ సినిమా మరో కనువిప్పుగా మారింది . ఫ్యాక్షన్ లీడర్స్ కుటుంబం లోని ఆడవారు ఎలా ఉంటారు అనే కోణం లో డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా చక్కగా చూపించాడు .రాయలసీమ లోని ఆడవారు ఇంట్లోనుండి వెళ్లిన మగవారు సాయంత్రనికి వస్తారో ,రారో ఎదురుచూస్తూ బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భాద ని కళ్లల్లో కనిపించకుండా చూసుకుంటూ ఎలా ఉంటారో చూపించాడు .

సినిమా మొదటి రోజే టాలీవుడ్ లోని చాలా రికార్డ్స్ తుడిచిపెట్టేసింది . US లో వేసిన ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మార్క్ ని అందుకొని ఎన్టీఆర్ సత్తా ఏంటో చూపించింది ఈ అరవిందసమేత . మొదటి రోజే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకొని దాదాపుగా 60 కోట్లకి పైగా రాబట్టి సినీ చరిత్రలో ఉన్న అన్ని రికార్డ్స్ ని బద్దలుకొట్టింది . రిలీజ్ అయిన రెండు రోజులలోపే 100 కోట్ల గ్రాస్ ని సాధించి మరో రెకార్డ్ ని సృష్టించింది . రోజు రోజుకి ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ లో మరిన్ని రికార్డ్స్ ఎన్టీఆర్ సృష్టిస్తాడో ఎవరికీ అర్థంకావడంలేదు . ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం కావస్తోనున్న ఈ సమయం లో పూర్తిగా కలెక్షన్స్ ని ఒకసారిపరిశీలిస్తే ..ఎన్టీఆర్ తన కెరియర్లో మరో మైలు రాయిని చేరుకున్నాడు అని అనిపిస్తుంది .ఇప్పటికి దాదాపుగా 220 కోట్లకి పైగాకలెక్షన్స్ తో ముందుకుపోతుంది. ఈ తరుణం లో ఎన్టీఆర్ కి ఎదురునిలిచే మొనగాడే లేకపోవడం తో ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .