//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Aravinda Sametha Veera Raghava cinema review

Category : movies

Aravindha Sametha Veera Raghava is an upcoming 2018 Telugu action film, produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas.

Release date: 11 October 2018 (India)

Director: Trivikram Srinivas

Music director: S. Thaman

Producer: S. Radha Krishna

Cinematography: P. S. Vinod

Cast:

N. T. Rama Rao Jr.(Veera Raghava Reddy)

Pooja Hegde (Aravindha)

Sunil(Aravindh), Eesha Rebba, Nagendra Babu,Jagapati Babu, Rao Ramesh, Naveen Chandra

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్యంలో ఈ రోజు రిలీజ్ అయినా అరవింద సమేత సినిమాపై భారీ అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా ఈషా రెబ్బ కూడా ఇంపార్టెంట్ రోల్ చేసింది. మరి ఆ అంచనాలను అరవింద సమేత అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .

కథ :

వీర రాఘవ (ఎన్.టి.ఆర్‌) ఫ్యాక్షన్ కుటుంబానికి దూరంగా ఎంతో ఆనందంగా ఉంటాడు. అరవింద (పూజా హెగ్డే ) చూసి ఇష్టపడతాడు. ఆమెను కాపాడే క్రమంలో అసలు తానెవరు అన్నది రివీల్ చేస్తాడు. అరవిందకి

ఇచ్చిన మాటకోసం బాసిరెడ్డి ( జగపతిబాబు ) నారప రెడ్డి ( నాగబాబు ) ల మద్య వైరం తగ్గించడానికి పూనుకుంటాడు . వీర రాఘవ అసలు విశ్వరూపం ఏంటి.. అది ఎలా బయటపెట్టాడు. శత్రువులను వీర రాఘవ ఎలా మట్టుపెట్టాడు.. యుద్ధం తర్వాత శత్రువులు ఎలా మిగిలారు. వారి కథని వీర రాఘవ ఎలా ముగించాడు తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

నటీనటుల ప్రతిభ :

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వీర రాఘవ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. సినిమా అంతా తారక్ తన భుజాన వేసుకుని నడిపించాడు. ఎన్టీఆర్ డైలాగ్స్ , నటన ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది . ఎన్టీఆర్ ఇంతకుముందు రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాల్లో నటిచినప్పటికీ వాటికీ ఈ అరవింద సమేత చిత్రానికి చాలా తేడా ఉంది . ఇక హీరోయిన్ పూజా హెగ్దె కూడా మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా అలరించింది. సునీల్ చాలా రోజుల తర్వాత కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. జగపతి బాబు విలనిజం గూస్ బమ్స్ తెప్పిస్తుంది. ఇక మిగిలిన పాత్రల్లో నాగబాబు , సితార , దేవయాని , సుప్రియ పతక్ లు తమతమ పాత్రలకు పూర్తీ న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ అదిరిపోయింది. కథకు తగినట్టుగా కెమెరా వర్క్ బాగుంది. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ అందించిన ఛాయాగ్రహణం హైలెట్ గా నిలిచింది, యాక్షన్ దృశ్యాల్లో తన పనితనం చాలా బాగుంది. పెనివిటి, అనగనగనగా సాంగ్స్ అలరించాయి. సిచ్యువేషన్ గా సాంగ్స్ వర్క్ అవుట్ అయ్యాయి. రాధాకృష్ణ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది చాల బాగున్నాయి. త్రివిక్రమ్ రాయలసీమ ఫ్యాక్షన్ ని కథగా ఎంచుకొని ఫ్యాక్షన్ బారిన పడిన వ్యక్తుల కుటుంబాలు , అందునా మహిళలు ఎలాంట్ బాధని అనుభవిస్తునారు అని చెప్పడంలో విజయం సాధించాడు . ఇక డైలాగుల విషయంలో అయితే త్రివిక్రం పెన్ పవర్ ఏంటో చూపించాడు.

ప్లస్ పాయింట్స్ :

ఎన్.టి.ఆర్ నటన

త్రివిక్రం డైలాగ్స్

క్లైమాక్స్

జగపతి బాబు విలనిజం

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ఏమి లేవు

బాటం లైన్ :

అరవింద సమేత వీర రాఘవ.. త్రివిక్రమ్ మాటలని, ఎన్టీఆర్ నటన తోడైతే ఈ సినిమా గురించి కొత్తగా చెప్పాలా.

రేటింగ్ : 4.5/5