//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుమ్మడికాయ కొట్టిన అరవింద సమేత చిత్ర యూనిట్...!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా , మతాల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌ టాకీ పార్ట్‌ పూర్తి అయ్యింది. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాన్స్‌ ఉన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఆ రెండు పాటలను విదేశాల్లో మరో 10 రోజుల పాటు చిత్రీకరించి పూర్తి చేయబోతున్నారు అని తెలుస్తుంది . ఈనెల 20న చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు శరవేగంగా చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు చిత్ర నిర్మాతలు . ఇదే సమయంలో ట్రైలర్‌ కట్టింగ్‌ కూడా జరుగుతున్నట్లుగా సమాచారం . సినిమా ఆడియో విడుదల కార్యక్రమం రోజే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఆడియో విడుదల కార్యక్రమం పూర్తి అయిన వెంటనే అంటే ఈనెల 20 తర్వాత విదేశాల్లో చిత్రీకరణకు యూనిట్‌ సభ్యులు వెళ్లబోతున్నారు. అక్టోబర్‌ 5 వరకు తిరిగి వచ్చేసి మిగిలి ఉన్న బ్యాలన్స్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేయాలనీ నిర్ణయిన్చారు అనుకుంటున్నట్లుగా దసరాకు విడుదల చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు తండ్రి పాత్రలో నాగబాబు కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు బాలయ్య రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.