//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోలీవుడ్‌లో అర‌వింద స‌మేత బీభ‌త్సం.. మామూలుగా లేదు భ‌య్యా..!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ NTR మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తొలిసారిగా తెర‌కెక్కుతున్న చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. ఈ సినిమా అక్టోబ‌ర్ 11న భారీ ఎత్తున ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు ప్ర‌పంచ వ్యాప్తంగా NTR కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా ఒక్కో ఏరియాకు గాను ఫైన‌ల్‌గా థియేట‌ర్స్ కౌంట్స్ తెలుస్తున్న విష‌యం తెలిసిందే.

క‌ర్ణాట‌క‌లో 350కి పైగా థియేట‌ర్లు, నైజాంలో 400ల వ‌ర‌కు థియేట‌ర్లు, సీడెడ్‌లో 400 లోపు థియేట‌ర్స్‌ల‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు త‌మిళ‌నాడులో టోట‌ల్ థియేట‌ర్స్ కౌంట్ కూడా ఆల్‌మోస్ట్ ఫినీష్ అయిన‌ట్టు స‌మాచారం అందుతుంది. అక్టోబర్ 11 నంచి 18 వ‌ర‌కు ఎలాంటి పోటీ లేకుండా రిలీజ‌వుతున్న ఈ సినిమా త‌మిళ‌నాడు లో 200 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యే అవ‌కాశం పుష్క‌లంగా ఉన్న‌ట్టు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇది డైరెక్ట్ తెలుగు మూవీస్ ప‌రంగా త‌మిళ‌నాడులో అత్యంత భారీగా రిలీజ్ అవుతున్న చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం భారీ హైప్ న‌డుమ రిలీజ్ అవుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రం త‌మిళ‌నాడులో 200 లోపు థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను అక్క‌డ సాధించే అవ‌కాశం పుష్క‌లంగా ఉంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. త‌మిళ‌నాడులో ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా 2.77 కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేయ‌గా, త‌రువాత వ‌చ్చిన తెలుగు సినిమాలు ఆ రికార్డును బ్రేక్ చేశాయి. ఇక తాజాగా త‌మిళ‌నాడులో రిలీజ్ అవుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌కు 18వ తేదీ వ‌ర‌కు ఎలాంటి పోటీ లేక‌పోవ‌డంతో మంచి టాక్‌ను సొంతం చేసుకుంటే.. అక్క‌డ కూడా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.