//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారీధరకి అరవింద సమేత శాటిలైట్ రైట్స్...ఎంతో తెలుసా....!

Category : movies

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో పూజా హగ్దే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. మొదటిసారి ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబో లో సినిమా రాబోతుండడం తో , వరుస విజయాలతో ఎన్టీఆర్ జెట్ స్పీడ్ లో ఉండడం తో ఈ మూవీ ఫై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇటీవల లీకైన పిక్స్ తో సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర శాటిలైట్ రైట్స్ దక్కించుకునేందుకు అన్ని చానెల్స్ పోటీపడ్డాయి. కానీ చివరకు జీ చేతికి ఈ రైట్స్ దక్కినట్లు తెలుస్తుంది. రూ.23 కోట్లకు జీ తెలుగు ఛానెల్ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం.

ఇక ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తం పలుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. తాజాగా ఓ దేవాలయం లో ఎన్టీఆర్ ఫై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.

ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం సెప్టెంబర్ లో విదేశాలకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుందని సమాచారం. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేయనున్నారు.