Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రికార్డ్స్ వేట కి మచ్చల పులి సిధ్దం…...

Category : movies

మాస్ లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. కెరీర్ లో మాస్ మూవీస్ నే ఎక్కువగా చేసిన ఎన్‌టి‌ఆర్ గత కొంత కాలంగా మాత్రం అన్నీ వర్గాలను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని మరింతగా పెంచేసుకుంటున్నాడు.

తాజా గా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న అరవింద సమేత సినిమా కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అండ్ టీసర్ లు దుమ్ము దులిపేయగా ఇప్పుడు వినాయక చవితి కానుకగా మరో లుక్ ని రిలీజ్ చేయనున్నారు.

సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్ కానుండగా అక్టోబర్ మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెన్ ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక అక్టోబర్ 11 న మచ్చల పులి బాక్స్ ఆఫీస్ పై దండెట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు…ఆ దాడి ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.