//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యూఎస్ఏ లో రికార్డు సృష్టించిన అరవింద సమేత..

Category : movies

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసారిగా తెరకెక్కిన సినిమా 'అరవింద సమేత వీర రాఘవ' ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో నే బెస్ట్ చిత్రం అని వార్తలు వినిపిస్తున్నాయి.

విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ ,పూజా హెగ్డే జోడీ అదిరిందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని అంటున్నారు. అయితే ఇటు ఎన్టీఆర్ అటు త్రివిక్రమ్ మూవీస్ కి యూఎస్ఏ లో మంచి మార్కెట్ వుంది. ఈ సినిమా యూఎస్ షోస్ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి.

ఈ సినిమాపై బారి అంచనాలు ఉండటంతో అమెరికాలో 200లకి పైగా ప్రీమియర్ షోలు వేశారు. అమెరికా కాలమానం ప్రకారం నిన్న (బుధవారం) రాత్రి 8 గంటల వరకూ 194 లొకేషన్స్ లో వేసిన ప్రీమియర్ షోల వలన $707,698 వసూళ్లు వచ్చాయి. ఇక అన్ని లొకేషన్స్ వసూళ్లు కలుపుకుంటే, ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోను దసరా సెలవలు కావడం పైగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ రావడంతో 100 కోట్లు దాటటం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.