//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరవిందసమేత ఫస్ట్ డే కలెక్షన్స్.........షాక్ లో తెలుగు చిత్ర పరిశ్రమ..!

Category : movies

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయిన మూవీ ‘అరవింద సమేత’కు ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైంది. బెనిఫిట్ షోలు - ప్రీమియర్ షోలతో నిన్న రాత్రి నుంచే సందడి మొదలైంది.తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ జోడి కట్టడంతో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి పవర్ ఫుల్ పాత్రని పోషించాడు .ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా కావడం తో సినిమా మొదలుపెట్టినప్పటి నుండే ఈ చిత్రం పై భారీ హైప్ ఉంది .

టీజర్ , టైలర్ లతోనే అరవిందుడి ప్రతాపం ఏంటో మొత్తం చూపించాడు . ఒక్క థియేట్రికల్ ట్రైలర్ టోన్ 92 కోట్ల రూపాయలు వచ్చాయంటేనే , అర్థమౌతుంది సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో .ఇప్పుడు అరవిందసమేత మొదటి రోజు కలెక్షన్స్ చుస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం గా కనిపిస్తుంది . us ప్రీమియర్స్ తో సహా అన్ని కలుపుకొని మొదటి రోజు 58 కోట్ల, 15 లక్షల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం .అదే సమయం లో డిస్ట్రిబ్యూటర్స్ కోటాలో దాదాపుగా 22 కోట్లకి పైగా సంపాదించింది తెలుస్తుంది .

ఈ విధంగా భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన చిత్రం ఈ మధ్య కాలం లో లేదు .ఈ అరవిందసమేత usa ప్రీమియర్స్ టోన్ రికార్డ్స్ వేట మొదలుపెట్టింది .అక్కడ దాదాపుగా 200 పైగా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం 8 లక్షల డాలర్స్ వాసులు చేసింది . ఇంకా usa నుండి పూర్తిగా సమాచారం రాలేదు అని తెలుస్తుండడం తో మిలియన్ మార్క్ ని ఈజీగా చేరుకుంటుంది అనిపిస్తుంది .మొదటి రోజే ఈ విధమైన కలెక్షన్స్ రావడం తో డిస్ట్రిబ్యూటర్స్ పండుగ చేసుకుంటున్నారు . ఇప్పటికే usa లో రంగస్థలం రెకార్డ్ చెరిగిపోయింది .ప్రీమియర్స్ షోస్ పరంగా ఎన్టీఆర్ కెరియర్ లో ఇదే టాప్ మూవీ అని ఇండస్ట్రీ లోని కొంతమంది చెప్పుకొచ్చారు .