Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరవింద సమేతకి అక్కడ దెబ్బె

Category : movies

ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్యంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అమెరికాలో అయితే రికార్డులు తిరగ రాస్తుంది. త్రివిక్రమ్ మాటలను ఎన్టీఆర్ పలుకుతుంటే ఫాన్స్ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇక రెడ్డి సాంగ్ అయితే ఎన్టీఆర్ డాన్స్ తో థియేటర్లు బద్దలవ్వడం ఖాయం. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజాహెగ్దే హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమా హిట్ తో ఫాన్స్ పండుగ చేసుకుంటుంటే శ్రీకాకుళం జిల్లాలో అరవింద సమేతకి వరుణుడు రూపంలో చేదు అనుభవం ఎదురైంది. తితలీ తుఫాను అక్కడ పెను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను దాటికి పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. దీని ప్రభావంవలన శ్రీకాకుళం -విశాఖ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేశారు. జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అనేక చెట్లు నేలకొరిగాయి. ఈ విపత్తు అక్కడి ఎన్టీఆర్ ఫాన్స్ కి ప్రేక్షకులకి పెద్ద షాక్ ఇచ్చింది.

Related News