//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర‌వింద స‌మేత బిజినెస్ త‌గ్గ‌డానికి కార‌ణ‌మిదే..!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ NTR, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ల కాంబినేష‌న్‌లో తాజాగా తెర‌కెక్కిన చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. ఇప్ప‌టికే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు బై ఏ స‌ర్టిఫికేట్‌ను పొందింది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేసింది.

కాగా, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.93 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ఓవ్సీస్‌లో క‌నీ.. వినీ రేంజ్‌లో రిలీజ్ చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల్ల సినిమా రూట‌ల్ లొకేష‌న్స్ ఇప్పుడు భారీగానే ఉన్న‌ప్ప‌టికీ రికార్డు బ్రేకింగ్ లెవ‌ల్లో లేవ‌ని చెబుతున్నారు సినీ విశ్లేష‌కులు. సినిమా ప్రీమియ‌ర్ షోల‌కు ఓవ‌ర్సీస్లో సుమారు 300ల‌కు పైగా లొకేష‌న్స్‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు అని అనుకున్నాకానీ, చివ‌రి నిమిషంలో సినిమా లొకేష‌న్స్ అన్నీ టోట‌ల్ కౌంట్ 250 వ‌ర‌కు మాత్ర‌మే ఉంద‌ని స‌మాచారం.

దానికి పూర్తి కార‌ణాలు తెలియ‌రాలేదు కానీ, పాత సినిమాల అగ్రిమెంట్స్ అలాగే, ఎక్కువ లొకేష‌న్స్‌లో రిలీజ్ చేయ‌డం వ‌ల్ల షేర్ త‌క్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, ఈ కార‌ణాల వ‌ల్ల సినిమా రిలీజ్ లొకేష‌న్స్‌ను లిమిటెడ్‌గానే ఉంచార‌ని స‌మాచారం అందుతుంది. దాంతో, ఓవ‌రాల్‌గా, ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా 250 వ‌ర‌కు లొకేష‌న్స్‌లో రిలీజ్ కానుండ‌గా, ఓవ‌రాల్‌గా, ఓవ‌ర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 12.5 కోటి వ‌ర‌కు జ‌రుగ‌గా, అందులో ఇప్పుడు ఒక కోటి రూపాయ‌ల వ‌ర‌కు బిజినెస్ త‌గ్గింద‌ని స‌మాచారం.

లొకేష‌న్స్ కౌంట్ త‌గ్గ‌డం వ‌ల్ల.. బిజినెస్ కూడా ఒక కోటి వ‌ర‌కు త‌గ్గ‌డంతో టోట‌ల్ ఓవ‌ర్సీస్ లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11.5 కోట్ల వ‌ర‌కు జ‌రిగింద‌ని స‌మాచారం. దాంతో రూ.93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఒక కోటి త‌గ్గి 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ఈ సినిమా సాధించిన‌ట్ట‌యింది.