//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశంలోనే మొదటి సారిగా. ...( AIMC)సెక్రటరీగా ఒక ప్రముఖ ట్రాన్స్ జెండర్

Category : politics national

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనూహ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పార్టీ కి సంబంధించి కీలక పదవికి గాను అఖిల భారత మహిళా కాంగ్రెస్ (AIMC) విభాగానికి జనరల్ సెక్రటరీగా ఒక ప్రముఖ ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్ ని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త అప్సరా రెడ్డి,రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియ జేయడం కోసం రాహుల్ ని కలవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఒక ట్రాన్స్ జెండర్ కి ఇలాంటి పదవి ఇవ్వడం ఇదే మొదటి సారి కావటం విశేషం.

అప్సరా రెడ్డి తన విద్యాభ్యాసం B.A డిగ్రీ జర్నలిజం తో పాటు M.A బ్రాడ్ కాస్టింగ్ విత్ ఏ స్పెషల్ ఫోకస్ అండ్ డెవలప్మెంటల్ ఎకనామిక్ స్ ఆవిడ సిటీ యూనివర్సిటీ లండన్ లో చదివింది. ఆ తరువాత జర్నలిజం కి సంబంధించి ప్రముఖ చానల్స్ లో తను పని చేయడం జరిగింది. బిబిసి వరల్డ్ సర్వీస్, ది హిందూ, కామొన్ వెల్త్ , లండన్ కి చెందిన న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంకా తను రాసిన చాలా ఆర్టికల్స్, కాలమొన్స్ వార్త పత్రికల్లో కూడా వచ్చాయి.అప్సరా రెడ్డి చాలా మంది ప్రముఖులతో ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్న వారిలో అమితా బచ్చన్,A.R రెహమాన్ వంటి వారే కాకుండా ఇంకా దేశ విదేశీ ప్రముఖులతో ఆవిడ ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది.