//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధుని ఒకే చేసిన ఏపీపీఎస్సీ.

Category : sports

ఒలింపిక్ క్రీడాకారిణి పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆమోదం తెలిపింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ అధ్యక్షతన గురువారం పాలకమండలి సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించింది.

ఒలింపిక్ క్రీడల్లో బాడ్మింటన్ లో రజత (వెండి) పతకం సాధించి దేశానికే కీర్తి తెచ్చిన తెలుగమ్మాయి పీవీ సింధుకు తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రభుత్వాలు భారీగా నజరానాలు ప్రకటించాయి. దీంతో పాటు ఏపీ సర్కార్ గ్రూప్ క్యేడర్ అయిన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు రెండురోజుల్లో వెలువడనున్నాయి.

Related News