//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

H1B వీసాల దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 3 నుంచి స్వీకరిస్తారు

Category : national

2018 వ వంవత్సరానికి గాను H1B వీసాల దరఖాస్తులను ఏప్రిల్ 3 2017 నుంచి స్వీకరించున్నట్లు US సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్విసెస్ సంస్థ(USCIS)తెలిపింది.ఎన్నిరోజులు దరఖాస్తులు స్వీకరిస్తారో క్లారిటీ ఇవ్వలేదు.అమెరికా ప్రభుత్వం ఏటా విదేశాయులకు జారీ చేసే 85000 H1B వీసాలలో 65000 జనరల్ క్యాటిగిరి చెందినవికాగా,20 వేలు అమెరికాలో విద్యనభ్యసించిన విద్యార్థుల కొరకు కేటాయించినవి.

అమెరికాలో రిసెర్చి,సైంటిఫిక్ ఇనిస్ట్యూట్సులో చేరేందుకు వచ్చే వారికి ఈ కోటా వర్తించదు కానీ USCIS ఈ సంవత్సరం ఆరు నెలలపాటు ప్రీమియం ప్రాసెసింగ్ ను రద్దు చేసిన కారణంగా ఇలావచ్చేవారికి ఇబ్బంది కానుంది .దీని ప్రకారం ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా H1B వీసాల ఎంపిక పాతనియమనిబంధనల ప్రకారమే జరుగుంన్నాయి.

అమెరికా 2018 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 2017 నుండి ప్రారంభం కానుంది ఏప్రిల్ 3 2017 నుండి వచ్చిన H1B వీసా దరఖాస్తులనే 2018 సంవత్సరానికి స్వీకరిస్తారని అంతకుముందు వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తారని USCIS తెలిపింది.ఫారం ఐ-129 దరఖాస్తుకు ఫీజును తాజాగా 460 డాలర్లకు పెంచినట్లు తెలిపారు..