జీఎస్టీ బిల్లు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, మాక్, ఐమ్యాక్, ఐప్యాడ్ ప్రొ ధరలను తగ్గించింది. ఐఫోన్లపై రూ.6,600 వరకు ధర తగ్గించగా, ఐప్యాడ్ల ధర రూ.3,900 తగ్గించింది. అదేవిధంగా మాక్బుక్ల ధర రూ.11,800 వరకు తగ్గిపోయింది.అయితే ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో కొనుగోలు చేస్తే యూజర్లకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తున్నది.
తగ్గిన ఐఫోన్ ధరలివే...
ఐఫోన్ ఎస్ఈ 32జీబీ - రూ.26వేలు
ఐఫోన్ ఎస్ఈ 128జీబీ - రూ.35వేలు
ఐఫోన్ 6ఎస్ 32జీబీ - రూ.46,900
ఐఫోన్ 6ఎస్ 128జీబీ - రూ.55,900
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 32జీబీ - రూ.56,100
ఐఫోన్ 6ఎస్ ప్లస్ 128జీబీ - రూ.65,000
ఐఫోన్ 7 (32 జీబీ) - రూ.56,200
ఐఫోన్ 7 (128 జీబీ) - రూ.65,200
ఐఫోన్ 7 (256 జీబీ) - రూ.80వేలు
ఐఫోన్ 7 ప్లస్ (32 జీబీ) - రూ.67,300
ఐఫోన్ 7 ప్లస్ (128 జీబీ) - రూ.76,200
ఐఫోన్ 7 ప్లస్ (256 జీబీ) - రూ.85,400