ప్రముఖ అమెరికన్ ఫోన్ల దిగ్గజం యాపిల్, గత నెలలో విడుదలచేసిన రెడ్ ఐఫోన్ 7, 7 ప్లస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు భారత్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ‘క్రోమా’ వెబ్సైట్ ద్వారా ముందస్తు ఆర్డర్లు తీసుకుంటున్నారు. కొనుగోలుదారుల చేతుల్లోకి ఈ కొత్త ఐఫోన్ ఎప్పుడు వచ్చేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
రెడ్ ఐఫోన్ 7, 7 ప్లస్ 128జీబీ, 256జీబీ వర్షన్ స్మార్ట్ఫోన్లకు ప్రస్తుతం ముందస్తు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 7 ప్రొడక్ట్ రెడ్ 128జీబీ వేరియంట్ ధర రూ. 70వేలు కాగా.. 256జీబీ మోడల్ ధర రూ. 80వేలు. అలాగే ఐఫోన్ 7 ప్లస్ ప్రొడక్ట్ రెడ్ రెండు స్టోరేజ్ వేరియంట్ల ధరలు వరసగా రూ. 82వేలు, రూ. 92వేలుగా ఉన్నాయి.